ఓటు ఒక ఆయుధం
అది నిర్ణయిస్తుంది ఒక విజేతను
గెలుపు ఓటములను తేల్చేది ఓటు
మరి ఆ ఓటు వుంది మన చేతిలో
నీ భవిష్యత్తు నీకు తెలియక పోవచ్చేమో కానీ
మన నాయకుల భవిష్యత్తు వుంది మన చేతుల్లో
ఓటును నిర్లక్ష్యంగా వేస్తే
మన భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టే!
మనదేశం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా
ఆధారపడి వుంది మన ఓట్లపై
సమయం వచ్చింది ఇప్పుడు మనకు
మన అమూల్యమైన ఓటును వేద్దాం
నిలబెడదాం విజేతగా మంచి నాయకుడిని
పయనింప చేద్దాం ప్రజాస్వామ్యాన్ని ప్రగతిపథంవైపు
- టి. కుళ్ళాయప్ప
టి.జి.టి సైన్స్
ఆంధ్రప్రదేశ్ గిరిజన
గురుకుల పాఠశాల, కడప
ఓటు
