వంటింట్లో మనం వాడే పదార్థాలు చర్మ సంరక్షణలో చక్కగా ఉపయోగపడతాయి. అయితే వాటిని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు.
బాదం పప్పులు, బాదం నూనె పొడిచర్మం కలవారికి సహజంగా చర్మకాంతి, మృదుత్వం పెరగడానికి ఉపయోగపడతాయి. జిడ్డుచర్మం కలవారు కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి, పైపొట్టు తీసి పేస్టులా తయారుచేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవాళ్ళు గింజల్ని అలాగే రుబ్బి, పాలు, పెరుగులో కలిపి శరీరంపై రాసుకోవాలి. బాదం నూనె చర్మానికి, తలలోని వెంట్రుకలకూ మంచిది.
వేప ఆకులు, బీట్రూట్ కలిపి తలకు రాసుకుంటే మాడుకు మంచిది. వేప, బీట్రూట్లను మిక్సీలో వేసి, తర్వాత వడకట్టి రసాన్ని రోజు మార్చి రోజు తలకి రాసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది.
విటమిన్-ఎ అధికంగా ఉండే క్యారెట్ మొటిమలకు చక్కగా పనిచేస్తుంది. క్యారెట్ జ్యూస్‌ని మొటిమలు, పొక్కులు, కురుపులపై రాయడం ద్వారా త్వరగా నయమవుతాయి.
కొన్ని మెంతులను నీటిలో వేసి కాచి, ఆ నీటిలో చేతులు కొద్దిసేపు ఉంచడం ద్వారా గోళ్ళు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
కొన్ని ఫిన్నల్ గింజలు లేదా ముక్కలను తేనె, పెరుగుతో కలిపి ముద్దగా చేసి, శరీరానికి రాసుకుంటే చర్మంపై పగుళ్ళు తొలగిపోతాయి.
ఓట్స్‌ని పొడిచేసి చర్మశుద్ధికి ఉపయోగించ వచ్చు. ఈ పొడిని నిత్యం రాసుకుని, స్నానం చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది .
తేనె, ఓట్ మీల్, పెరుగు కలిపి మాస్క్ వేసుకోవడం వల్ల జిడ్డు చర్మం కాంతివంతంగా మారుతుంది.
వంటింట్లోనే.. దేహ సంరక్షణ!
