ప్రకృతికి హాని లేకుండా ప్రకృతిలోంచే మట్టిని తెచ్చి, వినాయకుడి బొమ్మ ఎలా తయారుచేయొచ్చో నేర్చుకుందామా?
ా ముందుగా బంకమట్టి, టూత్ పిక్‌లు, ఎక్రిలిక్ రంగులు, రంగు కాగితం, థర్మాకోల్ తీసుకోవాలి. బంకమట్టి బజార్లో అమ్ముతుంటారు. అదే గ్రామాల్లో అయితే చెరువులు, కాలువల గట్టుల నుంచి సేకరించవచ్చు.
ా ముందుగా బంకమట్టిని బాగా పిసికి, బొమ్మ తయారీకి వీలుగా తయారుచేయాలి. దాంతో, కాళ్లు, చేతులు, తొండం, పొట్ట, తల భాగాల కోసం చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. చేతులకోసం కొంచెం సన్నగా, కాళ్ల కోసం ఇంకొంచెం లావుగా, పొట్టకోసం మరికొంత లావుగా ఉండలు చేసుకోవాలి.
ా ఫొటోలో చూపించిన విధంగా అన్ని శరీర భాగాలను అమర్చాలి. అయితే పొట్ట భాగానికి మాత్రం మట్టిని కొంచెం ఎక్కువగా తీసుకుని లావుగా పెట్టాలి. చివరగా తలకు కిరీటం వచ్చేలా మట్టిని చపాతీ మాదిరిగా చేసి పెన్నుమూత, బాటిల్ క్యాప్ సహాయంతో డిజైన్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కిరీటాన్ని తలకు అమర్చాలి.
ా రంగుల కాగితంతో గొడుగునూ తయారుచేసుకోవాలి. చివరగా ఆసనం కోసం థర్మాకోల్ ముక్క తీసుకుని దానిపై రంగు రిబ్బన్ అతికించాలి. అప్పుడు వినాయకుడి ప్రతిమను కూర్చోబెట్టాలి. అంతే మట్టి వినాయకుడు రెడీ!
మట్టి వినాయకుడి తయారీ
