కార్పెట్స్ ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు.. ఇంట్లో పిల్లలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఆడుకోవడానికీ సహాయపడతాయి. ఇవి ఇంట్లో వాతావరణాన్ని వెచ్చగా, సౌకర్యవంతంగా ఉంచుతాయి. అందువల్ల మనం కార్పెట్ కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఉడెన్ ఫ్లోర్ లేదా టైల్స్‌తో పోల్చినప్పుడు కార్పెట్ మెయింటైన్ చేయడానికి కొద్దిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అవుతుంది. ఎందుకంటే కొన్ని రకాల కార్పెట్స్ తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. మన బిజీ షెడ్యుల్‌లో అది ఎప్పుడూ సాధ్యం కాదు కాబట్టి, మన్నికైన కార్పెట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఎలాంటివైతే నాణ్యంగా ఉంటాయి ? ఎలాంటి రంగులు ఎంపిక చేసుకోవాలి ? వంటి విషయాలు ఈ వారం 'నివాసం'లో..!
కార్పెట్లు ఇంట్లో వేసుకోడానికే కాదు.. ఏవైనా పండుగలు.. శుభకార్యాలు ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. అందుకే కార్పెట్ కొనేమముందు కొన్ని ముఖ్యమైన అంశాలు పాటించాలి. కార్పెట్‌ను ఏ పర్పస్ కోసం కొంటున్నామనే అవగాహన తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కార్పెట్లు అనేక రకాల రంగులు, డిజైన్లలో ఉంటాయి. అంతే కాదు, కార్పెట్ తయారుచేసిన మెటీరియల్, డిజైన్స్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాటిని గుర్తించి కొనుగోలు చేయాలి.
ఇంటికి ఫర్ఫెక్ట్ కార్పెట్ కలర్..?
మన్నికైన కార్పెట్స్ తీసుకోకపోతే కలర్స్ షేడ్ అవ్వడం, లేదా కార్పెట్ మీద పడ్డ మరకలను తొలగించడానికి కష్టమవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కార్పెట్ కొనే ముందు మన్నికైనవి ఎంపిక చేసుకొని మరీ కొనాలి.
పర్ఫెక్ట్ ప్యాడింగ్తో సురక్షితం
ఫ్లోర్ మీద పరిచినప్పుడు ప్యాడింగ్ ఫర్ఫెక్ట్ గా ఉండాలి. మంచి మెటీరియల్‌తో తయారుచేసిన ప్యాడ్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పర్ఫెక్ట్ ప్యాడింగ్ ఉన్నవి త్వరగా పాడవకుండా, చిరిగిపోకుండా ఉంటాయి. ఇందుకోసం రబ్బర్ లేదా ఫోమ్ మెటీరియల్‌తో తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
జీవనశైలికి మ్యాచ్ అయ్యేలా
జీనవ శైలికి మ్యాచ్ అయ్యే కార్పెట్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని కార్పెట్స్ మీద అడుగుల జాడలు, వ్యాక్యూమ్ ట్రేసెస్ వంటివి అలాగే కనబడుతుంటాయి. కార్పెట్స్‌లో సాక్సాన్ కార్పెట్ చాలా సాధారణ కార్పెట్. దీన్ని ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉపయోగించవచ్చు. అంటే లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్స్‌లో ఉపయోగిం చుకోవచ్చు.
బడ్జెట్, టేస్ట్‌కు నప్పే విధంగా
బడ్జెట్‌కు సరిపోయే కార్పెట్‌ను ఎంపిక చేసుకొనేప్పుడు, ముందుగా షాపులను తెలుసుకోవాలి. అంతేకాదు మెటీరియల్ స్వభావం తెలుసుకొని ఎంపిక చేసుకోవడం మంచిది.
కార్పెట్ కొనే ముందు సాధ్యమైనంత వరకూ మన బడ్జెట్, మన టేస్ట్‌కు సరిపోయే ప్రదేశంలో ఎంపిక చేసుకోవలి. పెద్దపెద్ద షోరూమ్స్, ఫ్లోరింగ్ కంపెనీలు, ఫర్నీచర్ స్టోర్స్, లార్జ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్, ఆన్లైన్లో కాకుండా మనకు నచ్చిన చోట కొనుక్కోవడం ఉత్తమం.
నిర్వహణతో అధిక కాలం మన్నిక
తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ కాలం మన్నికగా ఉండే సురక్షితమైన మెటీరియల్‌తో తయారుచేసినవి ఎంపిక చేసుకోవాలి. మరీ ముఖ్యంగా స్టెయిన్ రెసిస్టెన్స్ కార్పెట్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల త్వరగా మరకలు పడకుండా నీట్‌గా, అందంగా కనబడుతుంది. ఖరీదైన వాటికి దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ త్వరగా పాడైపోయినా, మరకలు పడినా ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.
మోడల్స్, మెటీరియల్ ముఖ్యమే
అందంగా కనబడుతున్నాయి కదా అని ప్రత్యేకమైన కార్పెట్స్‌ను, లాంగ్ వ్యారెంటీ కార్పెట్స్‌ను కొనుగోలు చేయకూడదు. చాలా వరకూ ఇలాంటి కార్పెట్స్ సరిగా ఇన్స్టాల్ చేసి ఉండరు. కాబట్టి, వ్యారెంటీని చూడకుండా మీకు నచ్చినది ఎంపిక చేసుకోవాలి. వాలిటైల్ సబ్‌స్టాన్స్ లేని ఫార్మల్ డీహైడ్ కార్పెట్‌ను, కెమికల్స్ ప్రభావం లేని కార్పెట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. కార్పెట్స్ ను ఆర్గానిక్, ఉలెన్ వంటి సహజ పదార్థాలతో తయారుచేసిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వీటివల్ల ఇంట్లో పిల్లలకు, పెద్దలకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉంటుంది.
సేకరణ : లక్ష్మి తేజశ్విని
ఇంటికి అందాన్నిచ్చే కార్పేట్స్
