మనలో చాలా శాతం కుడిచేతి వాటం కలవారే. మరి ఎడమచేతి వాటం కలవారు ఎంతమంది ఉన్నారో ఆ విశేషాలేంటో మీరూ తెలుసుకోండి.
- ప్రపంచవ్యాప్తంగా 12 శాతానికిపైగా ఎడమచేతివాటం కలవారు (లెఫ్ట్ హ్యాండర్స్) ఉన్నారనేది ఒక అంచనా.
- మనుషులే కాదు కంగారూలూ, ఎలుకలు, కుక్కలు కూడా ఎడమచేతి వాటాన్ని కలిగుంటాయి.
- జంతువుల్లో ఎక్కువగా చేడమచేతివాటం కలిగుండేది పిల్లులే. వీటిలో యాభైశాతం ఎడమచేతి వాటం కలవేనని ఒక అధ్యయనం.
- మొత్తం అమెరికా జనాభాలో మూడు కోట్లమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారనేది ఒక అంచనా.
- లెఫ్ట్ అనే పదాన్ని ఆంగ్లో సాక్సన్ పదం లిఫ్ట్ నుంచి తీసుకున్నారు. జర్మన్, ఇటాలియన్ భాషలో ఎడమచేతి వాటం కల వారిని లిన్కిచ్, మ్యాన్సినొ అని పిలుస్తారు.
- ఎక్కువమంది ప్రముఖులు ఎడమచేతివాటం ఉన్న వారే అని మీకు తెలుసా? ఎలిజిబెత్ -2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియమ్ లాంటి రాజకుటుంబీకులతోపాటు, అల్బర్ట్ ఐన్‌స్టీన్, ఇజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్, బెన్జమెన్ ఫ్రాంక్లిన్ లాంటి శాస్త్రవేత్తలు ఎడమచేతి వాటం కలవారే.
- భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్, నటులు సావిత్రి అమితాబ్, అభిషేక్ ఇలా ఎంతోమంది ప్రముఖులు ఎడమచేతివాటం కలవారే.
- లెఫ్ట్ హ్యాండర్స్ పేరున ఒక నగరం ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఇది ఎక్కడుందంటే అమెరికాలోని ఉత్తర వర్జీనియాలో. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువమంది ఎడమచేతివాటం కలవారేకావడంతో ఈ నగరానికి లెఫ్ట్ హ్యాండ్ అనే పేరొచ్చింది.
- ఎడమచేతివాటం కలవారు రాయడం, టైపింగ్‌కు ఎలాంటి అసౌకర్యాం కలగకుండా ఉండేలా ప్రత్యేకంగా పెన్నులు, కీబోర్డులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు. కొన్ని దేశాల్లో వీరికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పనిముట్లను అమ్ముతుంటారు.
- ఇంతకీ ఈ లెఫ్ట్ హ్యాండర్స్ డే ఎప్పుడు మొదలయ్యిందో మీకు తెలుసా? యూ.కెేకు చెందిన ఓ లెఫ్ట్ హ్యాండ్స్ క్లబ్ ద్వారా 1990లో లెఫ్టెహ్యాండర్స్డే మొదలయ్యింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
- ఎడమచేతి వాటం కలవారు నీటి అడుగుభాగంలో ఉండే వాటిని ఎక్కువ స్పష్టంగా చూడగలరనేది ఒక అధ్యయనం.
- ఎడమచేతి వాటం ఆర్టిస్టులు గీసే ముఖచిత్రాలు ఎక్కువగా కుడి ముఖంగా ఉంటాయట.
- ఎడమచేతి వాటం కలవారిలో స్త్రీలకంటే పురుషులే ఎక్కువనేది ఒక అధ్యయనం.
- ఎడమచేతి వాటం కలవారికి సౌత్ పాస్ అని పేరు. ఇంతకీ ఈ పదం ఎలా వచ్చిందంటే బేస్‌బాల్ ఆటలో పిచ్‌నుంచి గ్రౌండ్లోకి బంతిని విసిరే వారిని పిచర్స్గా సంబోధిస్తారు. అలా ఎడమచేతి వాటం కల పిచర్స్ ద్వారా ఈ పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.
కుడి ఎడమైతే
