సెల్లో కవర్ ఆఫ్ ఆల్ పాపులర్ సాంగ్స్ ఆల్‌టైమ్.... భారీ వయోలిన్లా ఉండే సెల్లో వాద్యానిది విరహ సంగీతం. బల్గేరియాకు చెందిన వెసీస్లావా టొడోరోవా చేతిలో అది పడితే మనసు బందీ అయిపోతుంది. తీయగా హృదయాన్ని కోసేస్తున్న అనుభూతినిచ్చే ఈ సంగీతానికి అవధులు లేవు. బాల్కన్, స్విస్ ఆల్ఫ్స్ పర్వతాల్లోంచి వినిపించే ఆమె స్వరాలు దుబారు ఎడారుల్లోను సంగీత ఒయాసిస్సుల్ని ఒలికించాయి. శ్రీలంక, మనదేశంలోను ఆమె వాయులీనపు మృదుగాలులు వీచాయి. పాప్ సాంగ్స్, బాలీవుడ్ గీతాలకు కవర్ మ్యూజిక్‌ని ఒక్క సెల్లోతోనే అందించడంలో ఆమె ప్రత్యేకత. బాలీవుడ్ ప్రణయ చిత్రం 'ఆషికీ-2'లోని 'తుమ్హిహో..' పాటంటే మీకు ప్రాణమా..? అది విన్నప్పుడల్లా, చూసినప్పుడల్లా మీకు కలిగే ఫీలింగ్స్‌ని మరింత కొత్తగా పరిచయం చేస్తుంది వెసీస్లావా సెల్లో కవర్. సంగీతం ప్రజల్ని కలుపుతుందని నమ్మే వెసీస్లావా సెల్లో సంగీతంలో ఓసారి బంధీలైపోండి.
బంధీ చేసే వాద్యం
