'చేంజింగ్ బ్యాటరీస్' యానిమేషన్ షార్ట్‌ఫిల్మ్... సహచర్యం మీద తీసిన ఈ చిత్రం మీ గుండెను మెలిపెడుతుంది. పల్లెలో ఒంటరిగా ఉంటున్న తల్లికి సాయంగా ఓ రోబోను పంపిస్తాడు కొడుకు. ఇంటి పనులు చేసిపెట్టే ఆ రోబోతో ఆ వృద్ధురాలికి బంధం పెరుగుతుంది. తనతోపాటు రోబోకు ఇష్టమైనవి తేవడం, సర్కస్‌కు కూడా తీసుకెళ్లడం వంటివి చేస్తుంటుంది. కానీ, ఓ రోజు కుర్చీలోనే ఆమె చనిపోతుంది. ఆమెను దక్కించుకోవడం కోసం ఆ రోబో పడే ఆరాటం.. దాని ఆకాంక్ష... కంటతడి పెట్టిస్తుంది. 6 నిమిషాల ఈ వీడియోని చైనా పల్లెవాతావరణంలో తీశారు. కసాండ్రా ఎన్జి దీని దర్శకులు. లిమ్ షు గి కథను అందించడంతోబాటు చిత్రాన్ని నిర్మించారు.