ఎండైనా వానైనా మనం ఎక్కువగా ఉపయోగించేది గొడుగులనే. ఇలా మనల్ని ఎండా వానల నుంచి కాపాడేస్తున్న గొడుగుల వాడకం ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా?!
- భారత్‌లో రుతుపవనాలకు సూచికగా ట్విట్టర్ 2017లో నీలం రంగు గొడుగు ఎమోజిని విడుదల చేసింది.
- బిలియనైర్ కౌచ్చర్ ప్రపంచవ్యాప్తంగా అతి ఖరీదైన గొడుగు. ప్రముఖ డిజైనర్ యాంజిలొ గలాసొ రూపొందించిన ఈ వాటర్ ప్రూఫ్ గొడుగు ఖరీదు 34 లక్షలు.
- గొడుగుల దొంగతనాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ప్రంపంచవ్యాప్తంగా జపాన్‌లో అత్యధికంగా గొడుగుల దొంగతనాలు జరుగుతున్నాయనేది ఒక నివేదిక.
- చైనాలోని సొంగ్సియ ప్రాంతం గొడుగుల తయారీలో పేరొందింది. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 1000కిపైగా గొడుగులను తయారుచేసే ఫ్యాక్టరీలున్నాయి. ఇక్కడ పనిచేసేవారిలో ఒక్కొక్కరు గంటకు 40 గొడుగుల్ని కుట్టేస్తారు. ఈ మార్కెట్ ద్వారా ఏడాదికి దాదాపు 350 కోట్ల గొడుగులు ఉత్పత్తి అవుతున్నాయనేది ఒక అంచనా.
- 19వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో నీలం, ఆకుపచ్చ సిల్కు వస్త్రాలతో తయారుచేసిన గొడుగులను ఎక్కువగా ఉపయోగించేవారు.
- స్టీల్‌ను ఉపయోగించి గొడుగులను తయారుచేసిన తొలి వ్యక్తి శామ్యూల్ ఫాక్స్. ఇతని ద్వారా 1852 ఈ తరహా గొడుగులు వాడుకలోకి వచ్చాయి.
- చైనాలో క్రీ.పూ.11వ శతాబ్దంలోనే వాటర్ ప్రూఫ్ గొడుగులను ఉపయోగించేవారనే ఆధారాలున్నాయి.
- గొడుగులకు ఒక మ్యూజియం ఉందని మీకు తెలుసా? మైని తీరంలో ఉన్న పీక్స్ ద్వీపంలో గొడుగులపై ఉపయోగించే రకరకాల గుడ్డలతో ఈ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేసింది న్యాన్సి -3 హాప్‌మెన్ అనే మహిళ. తన ఇంట్లో పాడైపోయిన గొడుగు షీట్లను తొలగించి వాటిని భద్రపరుస్తుండేదట. అలా అవి వందకుపైగానే
అయ్యాయి. ఆ తర్వాత గొడుగుల కోసం ఉపయోగించే రకరకాల వస్త్రాలతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలనే ఆలోచన వచ్చింది.
అలా ఇప్పటి వరకు 700 గొడుగు తొడుగుల్ని సేకరించింది న్యాన్సి.
- బ్రాడ్ ఫోడ్ ఫిలిప్స్ 1969లో మడిచే గొడుగుల్ని తయారుచేశాడు. వీటిపై తీసుకున్నాడు..!
- ఆటోమేటిక్, కంపాక్ట్, బబుల్ ఇలా యాభైకి పైగా రకాల గొడుగులు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
- తొలి నాళ్ళలో గొడుగులు సంపద, శక్తికి సూచికలుగా ఉండేవి. అలా వివిధ దేశాల్లో సంపదకు చిహ్నంగా రకరకాల గొడుగులతో ప్రదర్శనలను నిర్వహించేవారు.
- ఆధునికతలో భాగంగా గొడుగులను టెఫ్రాన్ వస్త్రాలతో తయారుచేయడం మొదలయ్యింది. టెఫ్రాన్ గొడుగు లోపలికి నీరు చొరబడకుండా చేస్తుంది.
- 19వ శతాబ్దంలో ఇంగ్లండ్‌లో కత్తి, బాకు లాంటివి రహస్యంగా ఉంచే విధంగా గొడుగుల హ్యాండిల్స్‌ను తయారుచేసేవారు.
- 2000 ఏళ్ళ క్రితం పేపర్‌తో తయారుచేసిన ఆచ్ఛాదనలు చైనా, ఆసియా దేశాల్లో ఉపయోగించేవారు. ఈ నమూనాలోనే ఆ తర్వాత గొడుగులను తయారుచేయడం మొదలైంది.
- ప్రస్తుతం పిల్లలు మెచ్చే అనేక కార్టూన్ రూపాల్లో గొడుగులు అందుబాటులో ఉన్నాయి.
గొడుగుల మ్యూజియం
