పుస్తకాలు, బట్టలు ఇలా రకరకాల వస్తువుల్ని దానం చేసే వాళ్ళ గురించి మీరు వినే ఉంటారు. మరి మీరెప్పుడైనా జేమ్స్ హ్యారిజన్ గురించి విన్నారా. రక్తాదానాల్లో ఈయన అగ్రగణ్యుడు. ఇప్పటి వరకు హ్యారిజస్ చేసిన రక్తదానాలు వెయ్యికిపైగానే అంతేకాదు ఈయన చేసిన రక్తదానం ఆర్.హెచ్. వ్యాధి సోకిన 0.24 కోట్లమంది చిన్నారులకు కొత్త జీవితాన్నిచ్చింది. యాంటీ-డి ప్రతిరక్షకం అందించడం ద్వారా ఎంతోమంది గర్భిణులను బతికించిన ఈయనను 'ఏ మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్' అని పిలుస్తుంటారు. ఎనిమిది పదుల వయసులోనూ రక్తదానం చేస్తూ ఎంతో మందికి ప్రేరణ నిస్తున్నాడు. అసలు ఇంతకీ హ్యారిజన్కు ఇలాంటి ఒక మంచి ఆలోచన ఎలా వచ్చిందో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా.
ఆస్ట్రేలియాకు చెందిన హ్యారిజన్కు 1951లో అంటే తన పద్నాలుగో ఏట తన ఊపిరితిత్తులలో ఒక దాన్ని తొలగించారు. ఆ శస్త్రచికిత్స కోసం దాదాపు 13 యూనిట్ల రక్తం అవరసమైందట. మూడు నెలలు హాస్పిటల్లో చికిత్స పొందాడు. దాతలు అందించిన రక్తంతోనే తను తిరిగి జీవించగలిగాననే విషయం తెలిసింది తనకి. అప్పుడే తనూ రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆవిషయాన్నే తన తల్లిదండ్రులకు, అక్కడున్న డాక్టర్‌కు కూడా చెప్పాడట. అందుకోసం తను మరో మూడేళ్ళు ఆగాలని చెప్పారు డాక్టర్. అయితే తను మాత్రం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు. తన పద్దెనిమిదో ఏట తొలి రక్తదానాన్ని చేశాడు హ్యారిజన్. అలా ప్రతి 11రోజులు లేదా మూడు వారాలకోసారి తన రక్తదానం కొనసాగుతుండేది. అప్పుడే హ్యారిజన్ రక్తంలో యాంటి-డి అనే ప్రతిరక్షకం ఉందనే విషయాన్ని గమనించారు డాక్టర్లు. అప్పటికే ఆస్ట్రేలియాలో గర్భస్త మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్ హెచ్ వాధి. ఆర్ హెచ్ నెగటివ్ (రీసస్ నెగటివ్) కర్తాన్ని కలిగున్న గర్భస్త మహిళల గర్భంలో ఉన్న శిసువు ఆర్‌హెచ్ పాజిటివ్ రక్తాన్ని కలిగున్నప్పుడు రీసస్ వ్యాధి ఉత్పన్నమవుతుంది. ఇక ఈ వ్యాధి కారణంగా 1967లో ఆస్ట్రేలియాలో వేలాది మంది శిశువులు మృతిచెందారు. 17శాతం గర్బస్త మహిళ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆ వ్యాధి బారిన పడిన మహిళలకు యాంటి-డిని ఇంజక్షన్ల రూపంలో ఇవ్వడం ఒక్కటే పరిష్కారంగా ఉండేది. అత్యంత అరుదుగా లభించే యాంటి-డి హ్యారిజన్ రక్తంలో ఉండడంతో ఆ సమస్యకు ఒక చక్కని పరిష్కారం లభించింది. అలా హారిజన్ చేసిన రక్త దానం అస్ట్రేలియాలో ఇప్పటి వరకు దాదాపు 0.24 కోట్ల మంది ఆర్‌హెచ్ వ్యాధి బారిన పడిన చిన్నారులను రక్షించింది. అంతే కాదు తనకు కుదిరినప్పుడల్లా ఈయన రక్తదానం చేస్తూనే ఉండేవారు. అలా ఇప్పటి వరకు హారిజన్ చేసిన రక్తదానాల సంఖ్య 1,173. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రక్తదానాలు చేసిన వ్యక్తిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటుదక్కించుకున్న హ్యారిజన్ తన 81ఏట ఇటీవలే మరో రక్తదానం చేశాడీయన. అయితే ఇక్తదానం చేసేందుకుతన వయోపరిమితి కూడా దాటిపోతుండటంతో ఇక ఇదే తన చివరి రక్తదానంగా ప్రకటించాడీయన. ఎనిమిది పదుల వయసులోనూ రక్తదానం గొప్పతనాన్ని చాటిన హారిజన్ నేటి తరానికి ఒక మార్గదర్శి.
మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్
