కావల్సినవి :
స్ట్రాబెర్రీలు : 2 కప్పులు, పంచదార: 100 గ్రాములు, కోడిగుడ్లు: 3 పింట్ డబుల్ క్రీమ్: 500 మి.లీ, వెనీలా ఎక్సట్రాక్ట్: 1టేబుల్ స్పూన్, మొక్కజొన్న పిండి: 1టేబుల్‌స్పూన్,
తయారీ :
మొదటగా స్ట్రాబెర్రీలను శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో స్ట్రాబెర్రీ ముక్కల్లో పంచదార పొడి చల్లి బాగా మిక్స్ చేసి అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో కోడిగుడ్డు, మిగిలిన పంచదార, మొక్కజొన్నపిండి వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు మరొక పాన్ లో పాలుపోసి కాగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కోడిగుడ్డు, పంచదార మిశ్రమంలో పోసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సాస్ పానలో పోసి కలుపుతూ వేడిచేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక వేరే బౌల్లో తీసుకొని ఫ్రిజ్‌లో 4-5 గంటలపాటు అలాగే ఉంచి, సర్వ్ చేసే ముందుగా తీసుకొని అందులో డబుల్ క్రీమ్ వేసి మిక్స్ చేయాలి. ముందుగా తయారు చేసి పెట్టుకొన్న, స్ట్రాబెరీ, అలాగే వెనీలా ఎక్స్ ట్రాక్ట్‌ను కూడా పైన అమర్చి సర్వ్ చేయాలి అంతే, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం రెడీ.
స్ర్టాబెర్రీ ఐస్ క్రీం
