కావాల్సిన పదార్థాలు:
పుదీనా ఆకులు-1/2 కప్పు
కొత్తిమీర -1/2 కప్పు
ఉల్లిపాయ తరుగు-1/4 కప్పు
నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
చెక్కెర- చిటికెడు
పచ్చిమిర్చి తరుగు-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు-తగినంత
ఓట్స్-1 కప్పు
పనీర్ -1/4 కప్పు
క్యారెట్ (ఉడికించి ముద్దగా చేసుకోవాలి)- 1/4 కప్పు
బంగాళాదుంప (ఉడికించి ముద్దగా చేసుకోవాలి)- 1/2 కప్పు
అమ్చూర్ పొడి-1 టేబుల్ స్పూన్
గరంమసాలా-1/2 టేబుల్ స్పూన్
కారం-1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్
నూనె- వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
ముందుగా ఒక మిక్సీ జార్లో పుదీనా ఆకులు, సగం కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, చక్కెర, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌ల్లోకి తీసి ఓట్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న ఉండలుగాచేసి కట్లెట్లా వత్తి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో ఓట్స్‌ను తీసుకోవాలి. ఇందులో ముందుగా తయారుచేసుకున్న కట్లెట్లను అద్ది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఓట్లో అద్దిన కట్లెట్లను ఒక్కొక్కటిగా నూనెలో వేయించుకోవాలి. వేడి వేడి కట్లెట్స్ను సర్వింగ్ ప్లేట్స్‌లో ఉంచి టమాటా సాస్ లేదా చిల్లీసాస్‌తో రుచిచూడండి.