మిస్ కర్ణాటక అర్చన మోసాలి ముఖ్య పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో 'అరుంధతి అమావాస్య' చిత్రం రూపొందుతోంది. కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై కనమర్లపూడి కోటేశ్వర రావు నిర్మించారు. కె.వింధ్యారాణి సహ నిర్మాత. ఈనెల 20న దాదాపు వంద థిóయేటర్లలో చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం దర్శకులు తోట కృష్ణ ఈ చిత్ర వివరాలు తెలిపారు. అరుంధతికి అఘోరకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ చిత్రంలో ఓ పాము ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు ఉంటాయి. 'అమ్మోరు', 'అరుంధతి' చిత్రాల స్థాయిలో ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. అత్యంత ఆసక్తికరంగా సాగే కథలో నచ్చే కామెడీ ఎమోషనల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులు ఊహించిన దానికంటే చాలా బాగుందన్న అభిప్రాయంతో బయటకొస్తారు' అని తెలిపారు. ఈ చిత్రంలో బేబి కీర్తన, షకీలా, నిహారిక, ఆర్ కె మామ మధుబాబు, శంకర్ దాదా తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం ఘనశ్యాం, మాటలు : సంతోష్ హర్ష వర్ధన్, చరణ్ యలమంద.
'అరుంధతి' స్థాయిలో!
