- పాలక్ లల్వాని
రంజిత్, పాలక్ లల్వాని జంటగా దర్శకుడు త్రికోటి రూపొందించిన చిత్రం 'జువ్వ'. ఈ నెల 23న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ పాలక్ లల్వాని విలేకరులతో మాట్లాడారు.
నా మొదటి సినిమా 'అబ్బాయితో అమ్మాయి' చూసి దర్శకుడు త్రికోటి నన్ను సంప్రదించారు. నాకు కూడా స్టోరీ నచ్చడంతో ఒప్పుకున్నా. ఏడాది క్రితం ఈ సినిమా మొదలైంది. షూటింగ్ పూర్తయ్యేనాటికి దీనితో పాటే నేను తమిళంలో జీవీ ప్రకాష్‌తో ఒక సినిమా, తెలుగులో విశ్వంత్‌తో మరో చిత్రం చేశాను. రెండూ రిలీజ్ కావాల్సి ఉంది. 'జువ్వ'లో నార్మల్ అమ్మాయిగానే కనిపిస్తాను. కానీ చుట్టూ ఉన్న రకరకాల సమస్యలు, పరిస్థితులు నన్ను ఎలా మార్చాయి అనేదే సినిమాలో ముఖ్యమైన అంశం. మా నాన్న హిందీ సీరియల్స్‌లో పనిచేసేవారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ఎలా కష్టపడి పనిచేయాలో నాకు నేర్పించారు. ఈ సినిమా ఆరంభమైనప్పటి నుంచీ కొత్త విషయాల్ని నేర్చుకుంటూ హీరో రంజిత్ చాలా పరిణితి చెందారు. నాకు నాపై నమ్మకం ఎక్కువ. స్త్రీ సాధికారిత గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అనుష్క శర్మ చేసే బలమైన పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి డైరెక్టర్స్ చెప్పిన మంచి పాత్రలు చేస్తాను. సినిమా అయితే బాగా వచ్చింది. ప్రేక్షకులకి నచ్చుతుందనే నా నమ్మకం. నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది.
బలమైన పాత్రలు చేయాలనుంది
