తనదైన నటనతో వెండితెరపై అదరగొట్టారు ఎన్టీఆర్. ఇప్పుడు బుల్లితెరపైనా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్‌బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటివరకూ బిగ్స్క్రీన్పై తమ అభిమాన కథానాయకుడిని చూసిన అభిమానులు బుల్లితెరపై ఎలా ఉంటాడోనని ఆత్రుతగా ఎదురుచూశారు. అందరి అంచనాలకు తగినట్టుగానే ఎన్టీఆర్ తనదైన ఎనర్జీతో పరిచయ కార్యక్రమాన్ని నడిపించారు. ామారింది తెర సైజు మాత్రమే.. నేను కాదు్ణ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ నిజమేనని ాతొలి్ణరోజే నిరూపించింది. ఇక అసలు మజా ప్రారంభం కానుంది. మరి ఈ కొత్త పాత్రకు మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా, వారు నాకు సరిపడా చెల్లించారు అంటూ సమాధానమిచ్చారు. నిజంగా చెబుతున్నా. రెమ్యునరేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎదురయ్యే సవాళ్ల గురించే నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అంటూ నవ్వుతూ చెప్పారు.
ఆదివారం ప్రారంభమైన బిగ్‌బాస్‌లో అర్చన, సమీర్, ముమైత్‌ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, సంపూర్ణేష్‌బాబు, జ్యోతి, కల్పన, మహేష్కత్తి, కత్తి కార్తీక, శివబాలాజీ, ఆదర్శ్, హరితేజ, ధనరాజ్లు పాల్గొననున్నారు. మొత్తం 70రోజుల పాటు ఈ షో జరగనుంది. హిందీలో ప్రసారమైన ాబిగ్బాస్్ణ అశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే.
బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌పై ఎన్టీఆర్ మాట!
