'అతనొక్కడే' చిత్రంతో కథానాయకుడిగా కెరీయర్‌ను ప్రారంభించిన నందమూరి కళ్యాణ్‌రామ్ దర్శకుడిగా సురేందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చి సక్సెస్ సాధించాడు. దాదాపు ఇద్దరి కెరీర్లు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మళ్లీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయాలనుకున్నా సాధ్యపడలేదు. ఎట్టకేలకు 'కిక్2'తో సాధ్యపడింది. అయితే ఈ సినిమాకు కళ్యాణ్‌రామ్ నిర్మాతగా మారడం విశేషం. రవితేజతో 'కిక్' తీసిన సురేందర్‌రెడ్డితో సీక్వెల్ తీశారు. ఈ చిత్రానికి ఎక్కువ బడ్జెట్ కావడం, కళ్యాణ్‌రామ్‌తో విభేదాలు రావడంతో విడుదల ఆలస్యమైందని విమర్శలు ఇండిస్టీలో విన్పించాయి. ఆ తర్వాత ఈ చిత్రం విడుదలయింది. చిత్రం డివైడ్‌టాక్ వచ్చింది. ఈ సందర్భంగా అన్ని విషయాలను చర్చిస్తూ సురేందర్‌రెడ్డితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
'కిక్2' ఎలాంటి ఫలితాన్నిచ్చింది?
విడుదల తేదీ నుంచి మంచి స్పందన వచ్చింది. కొంతమంది సెకండాఫ్ లెంగ్తీ అని అన్నారు. చాలా మందికి నచ్చింది. నిర్మాత హ్యాపీగా ఉన్నారు.
కళ్యాణ్‌రామ్‌కు మీకు గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి?
మీడియాలో ఏదో రకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. మా మధ్యే గొడవలుంటే సినిమా రిలీజ్ అయ్యేది కాదు.
బడ్జెట్ ఎక్కువయిందనే టాక్ ఉంది?
ఎక్కువేమీ కాలేదు. కథ ప్రకారం ఎలా అనుకున్నామో అంతే అయింది. మధ్యలో కొంత అటూ ఇటూగా ఉండడం సహజమే.
20 నిముషాల ట్రిమ్ చేయడానికి కారణం?
చూసిన వారు కొద్దిమందికి సెకండాఫ్ ఎక్కువగా అనిపించింది. ట్రిమ్ చేస్తే బాగుంటుందని సూచించడం, ఎగ్జిబిటర్లు కోరడంతో చేయాల్సి వచ్చింది.
సినిమా తీసినప్పుడు అలా అనిపించ లేదా?
మేము అనుకున్నట్లు తీయగలిగాం. అలాంటప్పుడు మాకు లెంగ్తీ అనేది అనిపించదు. నాకైతే అంతా బాగుంది.
రవితేజ 10కిలో బరువు తగ్గడానికి మీ సూచనలు ఏమైనా ఉన్నాయా?
రవితేజకు సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన జిమ్‌లో ఎక్కువగా ఉంటారు. తన ఆరోగ్యం బాగా చూసుకోగలడు. ఏదైనా కష్టపడే మనిషి.
బీహార్ నేపథ్యంలో గ్రామీణులు అమాయకులు అని చూపించారు. కానీ వారు వేసే ప్లాన్ తెలివితేటల్తో ఉంటాయి. దీన్ని ఎలా చెప్పగలరు?
సినిమాలో వారికి తెలితేటల్లేవు. చేసేవన్నీ సిల్లీగా ఉంటాయి. కొన్నిచోట్ల అలా ఉన్నా... అవి ఎదుటి వారికి ఎంటర్టైన్ కలిగిస్తాయి.
గ్రామ ప్రజలంతా ఠాగూర్ చేసే అరాచకాలకు ప్రతీకారం తీర్చుకోవాలంటారు. కానీ ముగింపులో ఒక్కసారిగా వారు మారిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్?
సహజమే. ఎదుటివారిని ప్రేమించే తత్త్వంగల వారు వాళ్ళు. అందుకే ఆ సీన్‌ను అలా చూపించాం.
మనం శాంతికి నిదర్శనంగా పావురాన్ని చూపిస్తారు కదా. అలాంటి పావురంతో విలన్‌ను చంపించడం న్యాయమేనా?
ఎందుకు కాదు. ముగింపు రొటీన్‌గా కాకుండా కొత్తగా ఉండాలని పావురంతో చంపించాం.
ఈ సినిమాలో కంఫర్ట్ అనే పదం ఎలా పుట్టుకొచ్చింది?
ఏదైనా కావచ్చు. కథ కానీ, డైలాగ్స్ కానీ. ఒక పదం నుంచే పుడతాయి. అలా కంఫర్ట్ అనే పదం నుంచే ఈ స్టోరీ పుట్టింది. వక్కంతం వంశీ దాన్ని అల్లాడు.
'రేసుగుర్రం'లో కిల్‌బిల్ పాండేగా బ్రహ్మానందాన్ని చూపించి ఎంటర్టైన్ చేశారు. ఇందులో పండిట్ రవితేజ అని పెట్టారు. ఎంతవరకు ఉపయోగపడింది?
కిల్‌బిల్ పాండే పాత్రే మరలా పెడితే.. సేమ్ అని మీరే రాస్తారు. అందుకే కొత్తగా ఉండాలని పండిట్ రవితేజ పెట్టాం. ఆ పాత్రను ఆయన బాగా చేశాడు. అసలు హీరో పేరు ఆయనకు పెట్టడం కూడా హీరో గొప్పదానికి నిదర్శనం.
మీరు చిన్న సినిమాలు చేస్తారా?
నేను అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేయాలనుంది. నిర్మాతగా కూడా మారతాను. త్వరలో వివరాలు తెలియజేస్తాను.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏది?
జేమ్స్‌బాండ్ తరహా సినిమా చేయాలనుంది.
ఏ హీరో అనుకుంటున్నారు?
మహేష్‌బాబుతోనే.
రామ్‌చరణ్ సినిమా ఎంతవరకు వచ్చింది?
ఇప్పుడు శ్రీనువైట్ల సినిమా చేస్తున్నాడు. అది అయ్యాక నేను చేస్తాను. కథ రెడీ అయింది. మూడు నెలల్లో సెట్‌పైకి వెళుతుంది.
మహేష్‌బాబుతో జేమ్స్‌బాండ్ లాంటి సినిమా తీయాలనుంది
