యథార్థ సంఘటన ఆధారంగా ముగ్గురు జంటల ప్రేమ కథపై రూపొందించనున్న చిత్రం 'ప్రేమిక'. మహీంద్రా, పవన్, శౌర్య, లిషిత, జానకి, మోనికా ప్రధాన పాత్రదారులు. మౌంటెన్ మూవీస్ పతాకంపై మహీంద్రా దర్శకత్వంలో శంకర్, వెంకట కృష్ణ, లక్ష్మయ్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లోని జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహీంద్రా మాట్లాడుతూ భద్రాచలం లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శంషాబాద్ దగ్గరలో ఓ విలేజ్లో, పూణేలోని ఖండాలా, బెంగుళూరు తదితర ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. మొత్తం 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీత దిలీప్ భండారి.
ముగ్గురు జంటల ప్రేమ కథ
