- సీపీఐ కార్యదర్శి చాడ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
సీమాంధ్రుల కంటే అన్యాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరి ణామాలు గమనిస్తే 'గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు' వచ్చినట్టుగా ఉందన్నారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాం కుల్లో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాని కారణం గా తిరిగి వారికి రుణాలు ఇవ్వడం లేదన్నా రు. దీంతో రైతులకు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు.
రైతులను పట్టించుకోని ఈ సర్కారు 'హరిత హారం' పేరుతో హంగామా చేస్తున్నదని విమర్శిం చారు. ఆ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబ్బును దు బారా చేస్తున్నదని తెలిపారు. ఈ ప్రచారంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్ర మే ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు ఉన్న భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నార న్నారు. హరిత హారం కాస్తా దళితులకు ఉరితాడుగా మారిందని చెప్పారు. పోడు భూములను ప్రభుత్వం లాక్కొంటు న్నదని, ఈ అంశంలో గిరిజనులకు తాము అండగా నిలబడతామని తెలిపారు.
రవీందర్కుమార్ను అనర్హుడిగా ప్రకటించాలి
- స్పీకర్ను కోరిన చాడ
దేవరకొండ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన రవీందర్కుమార్ను అన ర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారిని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు స్పీకర్ను బుధవారం కలిసిన ఆయన వినతిపత్రం అందించారు. సీపీఐ తరుపున గెలిచిన రవీందర్ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఎన్ని కల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా, పార్టీకి వ్యతి రేకంగా వ్యవహరించిన ఆయనను వెంటనే అన ర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
'బర్రెలు' తినేటోడు వచ్చాడు
