పిఠాపురం : విద్యాదాత పిఠాపురం మహారాజా రావు మహీపతి సూర్యారావు బహదూర్ 134వ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వ హించారు. ఇందులో భాగంగా కోటగుమ్మం సెంటర్లో ఉన్న రాజా వారి విగ్రహానికి ఆయన వారసులు రావు వెంకట మహీపతి రామరత్నారావు, ఎంఎల్ఎ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహన రావు, జనసేన పార్టీ నాయకురాలు మాకినీడి శేషుకుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఆర్ఆర్బి హెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సాయిబాబా రాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఘనంగా పిఠాపురం రాజా జయంతి
