ప్రజాశక్తి-గుంటూరుక్రీడలు
గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16నుంచి 18వ తేదీ వరకూ అండర్-14బాలబాలికల పెటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ పోటీను నిర్వహించ నున్నట్లు ఎన్ఐఐటి గుంటూరు శాఖ డైరెక్టర్ ఎన్.ఫణిరాం తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరులోని వివిధ టెన్నిస్ కోర్టుల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. జిల్లా టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షులు ఎస్ఎన్ కమల్ మాట్లాడుతూ పోటీల్లో వందమంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సిటిసి, ఎన్టిఆర్ స్టేడియం, ఆఫీసర్స్‌క్లబ్ టెన్నిస్ కోర్టుల్లో వీటిని నిర్వహిస్తామన్నారు. పోటీల స్పాన్సర్ ఎన్ఐఐటి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీలకు శ్రీకుమార్ చీఫ్ రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో జిల్లా టెన్నిస్సంఘం కార్యదర్శి ఎన్.సాంబశివరావు, సభ్యులు ఆర్వి రమణ, టెన్నిస్ శిక్షకులు వెంకటరావు, శివప్రసాద్, రాజేష్ పాల్గొని పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
నేటినుంచి అండర్-14 టెన్నిస్ పోటీలు
