- అన్ని జిల్లాల్లోనూ కరువు ఛాయలే- రెయిన్ గన్లకూ నీరు కరువే
- రెయిన్గన్లకూ నీరేది?
- అనంతలో అదును దాటిన వేరుశనగ సాగు
ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి
ఖరీఫ్‌పై గంపెడాశలతో అనంతపురం జిల్లాలో వేరుశనగ సాగుకు సిద్ధమైన రైతుకు తీరని నిరాశే మిగులింది. వేరుశనగ సాగుకు అనువైన జులై నెలలో వర్షం కురవక కపోవడంతో సిద్ధం చేసుకున్న వేరుశనగ విత్తనాలను మార్కెట్లో అమ్ముకునేందుకు వేరుశనగ రైతు సమాయత్తమయ్యాడు. రెయిన్గన్లకూ నీరు దొరకని పరిస్థితి. జూన్‌లో ఒక మోస్తరు వర్షాలు రావడంతో రైతులంతా విత్తనం కొని, దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు. జులై నెలలో విత్తనం విత్తుకుందామనుకున్న సమయంలో చినుకు నేల రాలలేదు. ఫలితంగా రైతులు విత్తనం విత్తుకోలేకపోయారు. అరకొరగా విత్తిన చోట పైరు ఎండిపోయే దశకు వచ్చింది. జిల్లాలో మరోమారు కరువు ఛాయలు అలుముకున్నాయి.సాధారణ సాగు విస్తీర్ణం 22 లక్షల ఎకరాలు. ఈ ఏడాది కనీసమైన 18 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అదే అత్యధికంగా సాగు చేసే వేరుశనగ సాధారణంగా 15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. కానీ ఇప్పటి వరకు విత్తనం వేసింది కేవలం 4.12 లక్షల ఎకరాల్లో మాత్రమే. అంటే సాధారణంలో మూడో వంతుకే వేరుశనగ సాగు పరిమితమైంది. ఇప్ప టికే ఈ సాగుకు అదును దాటుతోంది. ఇకపై వర్షాలొచ్చినా ఏ మేరకు సాగు పెరుగుతుందన్న ఆశలేదు. ఒకవేళ ఆగస్టులో వర్షాలొచ్చినా రైతులు ప్రత్యామ్నాయం వైపు వెళ్లాల్సిన పరిస్థితులే నెలకొనడం గమ నార్హం. జిల్లాలో 63 మండలాలకుగానూ 45 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భూగర్బ జలాలు పడిపోవడంతో బోర్లలోనూ నీటి మట్టం పడిపోయింది. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 19.54 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. దీంతో రెయిన్గన్లకు తగినంత నీరు అందుబాటులో లేదు. ఇప్పటికే వేరుశనగ పంట సుమారు 1.72 లక్షల ఎకరాల్లో వాడపట్టింది.
మరో రెండు వేల ఎకరాలు వాడపట్టింది. వీటికి తక్షణం నీరందవ్వాల్సిన అవసరముంది.
కానరాని చినుకు
