- మానవునిలో లోపించిన ఎముక
అస్థిపంజర వ్యవస్థ : జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి, దృఢమైన ఆకారం, రక్షణ నిచ్చే నిర్మాణం, అస్థిపంజరం
ఇది జీవులలో రెండు రకాలు :
1. బాహ్య అస్థిపంజరం ( ఎక్సో స్కెలిటన్)
2. అంతర అస్థిపంజరం (ఎండో స్కెలిటన్)
1. బాహ్య అస్థిపంజరం
ఇది దృఢమైన, రక్షణనిచ్చే బయటి నిర్జీవ పొర
ఉదా : నత్తలు, ఆల్చిప్ప, ప్రవాళాల కర్పరం, కీటకాల స్ల్కీరైట్లు, సకశేరుకాల వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు, కోడిగుడ్డు పెంకు.
2. అంతర అస్థిపంజరం
ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.
దీనిలో రెండు రకాల ఎముకలు ఉన్నాయి. అవి :
1. మృదులాస్థి (కార్టిలేజ్)
2. అస్థి (బోన్)
1. మృదులాస్థి (కార్టిలేజ్)
- మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థులు అంటారు.
- మృదులాస్థుల అధ్యయనాన్ని 'కాండ్రాలజి' అంటారు.
- మృదులాస్థులలోని ప్రోటీన్ : కాండ్రిన్
- దీనిలో ఉండే కణాలు - కాండ్రోసైట్స్
- ఇవి సాగే గుణం కలిగి చలనానికి సహాయపడతాయి.
ఇవి ఉండే ప్రదేశాలు :
1. వెలుపలి చెవి (పిన్నా)
2. ముక్కు కొన/ నాసికాగ్రం
3. కొండనాలుక/ ఉపజిహ్విక (ఎపిగ్లాటిస్)
4. వాయునాళంలోని ఉంగరం/ సి ఆకారపు నిర్మాణాలు
2. అస్థి (బోన్)
- గట్టిగా, దృఢంగా ఉండే ఎముకను 'అస్థి' అంటారు.
- వీటి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు.
- వీటిలో ఉండే కణాలు - ఆస్టియోసైట్స్
- మానవునిలోని మొత్తం ఎముకల సంఖ్య 206.
- పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో సుమారు 300 వరకూ ఎముకలు ఉంటాయి.
- అతిపెద్ద, పొడవైన ఎముక : ఫీమర్/ తొడ ఎముక
- అతిచిన్న ఎముక : స్టెఫిస్ (లేక) కర్ణాంతరాస్థి.
- పుర్రెలో అతి గట్టిది : కింది దవడ (లోవర్ జా)
- మానవునిలో అతి గట్టి ఎముక - ఫీమర్
- కప్పలో అతిపెద్దది - టిబియో - ఫిబ్యులా
- ఎముకలు దృఢంగా ఉండడానికి కారణం క్యాల్షియం (సిఎ), ఫాస్పరస్ (పి). ఇవి క్యాల్షియం ఫాస్పేట్, క్యాల్షియం కార్బొనేట్ రూపాలలో ఉంటుంది.
- క్యాల్షియం ఫాస్పేట్ ఎక్కువగా ఉంటుంది.
- ఫాస్పరస్‌కు మండే స్వభావం ఉండటం వల్ల శవాలను కాల్చినపుడు కాంతివంతంగా ఉంటాయి.
1. తల : దీనిలోని ఎముకలన్నింటినీ కలిపి 'పుర్రె' అంటారు.
ఇది నాలుగు భాగాలు
1. కపాలం - 8
2. ముఖం - 14
3. చెవి - 6 (3+3)
4. నాలుక కింద - 1
మొత్తం - 29
- కపాల అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటారు.
- తలలో కదిలే ఎముకలు - 1 (కింద దవడ)
- కదలని ఎముకలు - 28
మొత్తం - 29
- ముఖము (సౌందర్యం) అధ్యయనం : కాలాలజి
- అందవిహీనులకు భయపడడం - కాలోఫోబియా
2. చెవి : దీని అధ్యయనాన్ని 'ఓటాలజీ' అంటారు.
- ఇది ఒక జ్ఞానేంద్రియం
- ఎముకల సంఖ్య : 6 (3+3)
ఎ. మాలియస్
బి. ఇంకస్
సి. స్టెపిన్
3. నాలుక కింద : 1 (హయాయిడ్ ఎముక)
నోట్ : ఉరి వేసినపుడు విచ్చిత్తి చెందుతుంది.
4. భుజవలయం : (షోల్డర్ గిర్డిల్) : 4 (రెండు జతలు) వీటిలోని ఎముకలు
ఎ. కాలర్ బోన్ (క్లావికిల్)
బి. షోల్డర్ బోన్ (స్కాప్యులా)
5. చేతులు : 60 (30+30)
ఎ. భుజం : 3 ఎముకలు (హ్యూమరస్ + రేడియస్ + అల్నా)
బి. మణికట్టు (వ్రిష్ట) : ఎనిమిది
సి. అరచేయి (పామ్) : ఐదు
డి. వేళ్లు (ఫింగర్స్/ కార్పల్స్) : 14
6. వెన్నెముక (బ్యాక్‌బోన్) : 26 (చిన్నపిల్లల్లో 33)
7. పక్కటెముకలు (రిబ్స్) : 24 (12 జతలు)
8. రొమ్ము ఎముక (స్టోర్నమ్) : 1
9. కటివలయం (పెల్విక్ గిర్డిల్) : రెండు (1 జత)
10. కాళ్లు : 60 (30+30)
ఎ. కాలు : నాలుగు (పటెల్లా + ఫీమర్ + టీబియో + ఫిబ్యులా)
బి. చీలమండ (యాంకిల్) : ఏడు
సి. అరికాలు : ఐదు
డి. వేళ్లు (టార్సెల్స్) : 14
ఎముకలు ఉండే ప్రదేశాలు
ఎ. కపాలం + ముఖం - 22 (8+14)
బి. చెవి - ఆరు
సి. నాలుక కింద - ఒకటి
డి. భుజవలయం - నాలుగు (రెండు జతలు)
ఇ. చేతులు - 60 (30+30)
ఎఫ్. వెన్నుముక - 26
జి. పక్కటెముకలు - 24
హెచ్. రొమ్ము ఎముక - ఒకటి
ఐ. కటివలయం - రెండు (ఒక జత)
జె. కాళ్లు - 60 (30+30)
మొత్తం - 206
వ్యాధులు
1. ఆర్థరైటిస్ : ఇది సాధారణ కీళ్లనొప్పి. దీనిని నివారించడానికి 'తేనెటీగల' విషాన్ని మందుగా వాడతారు.
2. స్పాండిలైటిస్ : వెన్నునొప్పి
3. రుమటాయిడ్ అర్థరైటిస్ : కీళ్ల మధ్య 'సైనోనియల్' ద్రవమును చుట్టూ ఉండే సైనోవియల్ త్వచం వాయడం, మృదులాస్థిపై దృఢమైన కణజాలం ఏర్పడడం వల్ల తీవ్రమైన కీళ్లనొప్పి ఉండడం. ఇది 20-40 సంవత్సరాల మహిళల్లో చాలా తరచూ కనబడుతుంది.
4. రికెట్స్ : చిన్న పిల్లల్లో 'డి' విటమిన్ లోపం వల్ల ఎముకలు వంగడం.
5. ఆస్థియోమలేషియా : పెద్దవారిలో 'డి' విటమిన్ లోపం వల్ల ఎముకలలో క్యాల్షియం, ఫాస్పరస్ లోపించి మెత్తగా మారడం.
6. ఆస్టియోపోరోసిస్ : 'పారాథార్మోన్' అధికస్రావం వల్ల ఎముకలపై రంధ్రాలు పడి క్యాల్షియం, ఫాస్పరస్ బయటికి రావడం వల్ల ఎముకలు పెళుసుగా మారతాయి.
7. గౌట్ : రక్తంలో, కీళ్లల్లో 'యూరిక్ ఆమ్ల స్ఫటికలు' (సోడియం బైయూరేట్) పేరుకొని పోవడం వల్ల కలిగే కీళ్ల నొప్పి. దీనివల్ల వాపు, జ్వరం, చలి, టాకీకార్డియా వంటి లక్షణాలు కనపడతాయి.
నోట్ : ఈ వ్యాధి చికిత్సలో వాడే రసాయనం - కాల్చిసిన్.
8. ఆస్టియో ఆర్థరైటిస్ : కీళ్ల మధ్య ఉన్న మృదులాస్థి నశించడం, సైనోవియల్ ద్రవం తగ్గడం.
9. ఫ్లోరోసిస్ : నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వల్ల దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపాలలోకి మారడం.
- నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ డబ్ల్యూహెచ్ఓ వారి ప్రకారం ప్రతి వ్యక్తికి కావాల్సిన ఫ్లోరిన్ పరిమాణం - 1 మి.గ్రా/లీటర్
- నీటిలో ఉండాల్సిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం - 0.7 మి.గ్రా -1.2 మి.గ్రా/లీటర్
అస్థిపంజరం విధులు
1. శరీరానికి ఆకారం, నిర్మాణం ఇవ్వడం
2. సున్నిత అవయవాలకు రక్షణ
3. ఆర్బిసి, డబ్ల్యూబిసిల ఉత్పత్తి
4. చలనానికి సహాయం
5. మూలకాలు, కొవ్వు నిల్వ
6. అస్థిమజ్జలోని ఎరిత్రోపాటియిన్ అనే ప్రోటీన్ వల్ల రక్తం ఉత్పత్తవుతుంది.
కీళ్లు (జాయింట్స్)
- రెండు లేదా ఎక్కువ ఎముకలు 'లిగమెంట్' అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని 'కీలు' అంటారు.
- వీటి అధ్యయనాన్ని ఆంథ్రాలజీ అంటారు.
- ఇవి ముఖ్యంగా నాలుగు రకాలు
ఎ. బంతిగిన్ని కీలు (బాల్ అండ్ సాకెట్) - భుజము
బి. మడతబందు కీలు (హింజ్ జాయింట్) - మోచేయి, మోకాలు
సి. జారెడు కీలు (గ్లైడింగ్ జాయింట్) - వెన్నెముక, మణికట్టు
డి. బొంగరపు కీలు (పివోట్ జాయింట్) - మెడ
- ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు
- బంతిగిన్నె కీలు, మడతబందు కీలు.
- స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉపయోగించే కీలు
- బంతిగిన్నె కీలు, మడతబందు కీలు, జారుడు కీలు
- భరతనాట్యం, కూచిపూడి, నాట్యకారులు ఎక్కువగా ఉపయోగించే కీలు - బొంగరపుకీలు
కండరాలు (మజిల్స్)
- వీటి అధ్యయనాన్ని 'మయాలజి/సార్కాలజీ' అంటారు.
- వీటి కదలికల అధ్యయనాన్ని 'కైనిసాలజి' అంటారు.
- ముఖ్యనిధి : సంకోచ, సడలికలు చెంది ఎముకలను కదల్చడం
- వీటి మొత్తం సంఖ్య : 639
- అతిపెద్ద కండరం : గ్లుటియస్ మాక్జిమస్ (పిరుదు కండరం)
- అతి చిన్న కండరం : స్టెపీడియస్ (చెవి కండరం)
- అతి పొడవైన కండరం : సార్టోరియస్ (తొడ కండరం)
- అతి బలమైన కండరం : మాసెటర్ (దవడ కండరం)
- కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు : కె, సిఎ
- దీనిని వివరించే సిద్ధాంతం 'స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ'
- దీనిని ప్రతిపాదించినది : హక్సలే.
- కండరాలకు వచ్చే క్యాన్సర్ : సర్కోమా/ మయోమా
- కండరాలలో ఉండే వర్ణకం : మయోగ్లోబిన్ (రెడ్)
కండరాల మూడు ముఖ్య లక్షణాలు
ఎ. టిటాని, బి. కండర గ్లాని, సి. రిగర్ మోర్టిన్
1. టిటాని : టిటాని అనగా 'పారాథార్మోన్' తక్కువ స్రావం వల్ల కండరాలు ఎల్లప్పుడు సంకోచం చెందడం. దీనివల్ల ఎముకలు కదలవు.
- ఇది క్యాల్షియం లోపం వల్ల, పాస్పరస్ ఎక్కువ కావడం వల్ల సాధారణంగా కనబడును.
2. కండర గ్లానీ : (మజిల్ ఫ్యాటిగ్యూ) కండరాలు ఎల్లప్పుడూ పనిచేయడం వల్ల వాటికి సరైన ఆక్సిజన్ అందక అవాయుశ్వాసక్రియ జరుపుకొని 'లాక్టిక్ ఆమ్లం' ఏర్పరచడం వల్ల కండరాలు అలసట చెందుతాయి.
3. రిగర్ మోర్టిన్ : జీవి చనిపోయిన తర్వాత దానిలో ఎటిపి ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్టిన్, మయోసిన్ అనే కండరాల ప్రోటీన్స్ పనిచేయక శరీరం గట్టిగా మారడం.
కండరాలు రకాలు :
1. అస్థి/ నియంత్రిత కండరాలు (వాలంటరీ / స్కెలిటల్) : ఇవి ఎముకలను అతుక్కుని కదలికలకు తోడ్పడతాయి.
- వీటిపై చారలు ఉంటాయి. కాబట్టి రేఖిత కండరాలు అంటారు.
ఉదా : చేతి, కాలి కండరాలు
2. నునుపు / అనియంత్రిత కండరాలు (స్మూత్/ ఇన్వోలెంటరీ) : వీటిని అరేఖిత కండరాలు అంటారు.
- ఇవి నియంత్రించలేనివి.
ఉదా : పేగు, జీర్ణాశయం, మూత్రాశయం, గర్భాశయం, కంటిలోని కండరం.
3. హృదయ కండరాలు (కార్డియాక్ మజిల్స్) : ఇవి హృదయంలో ఉంటాయి.
- ఇవి నిర్మాణరీత్యా రేఖిత కండరాలను, క్రియరీత్యా అరేఖిత కండరాలను పోలి ఉంటాయి.
* నమూనా ప్రశ్నలు
1. కపాలం ఎముకల అధ్యయనం ?
ఎ. ఆస్టియాలజీ బి. కాలాలజీ
సి. క్రానియాలజీ డి. ఓటాలజీ
2. చెవిలోని ఎముకల సంఖ్య ?
ఎ. రెండు బి. మూడు
సి. నాలుగు డి. ఆరు
3. తేనెటీగల విషాన్ని ఏ వ్యాధికి మందుగా వాడతారు ?
ఎ. స్పాండిలైటిస్ బి. రికెట్స్
సి. ఆర్థరైటిస్ డి. గేట్
4. చిన్న పిల్లల్లోని మొత్తం ఎముకల సంఖ్య ?
ఎ. 206 బి. 300 సి. 439 డి. 639
5. నీటిలో ఉండాల్సిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం (మిగ్రా/లీటర్) ?
ఎ. 0.1-07 బి. 0.7-1.2
సి. 1-1.5 డి. 2
6. స్పిన్ బౌలర్ ఎక్కువగా ఉపయోగించే కీలుకానిది ?
ఎ. బంతిగిన్నె కీలు బి. మడతబందు కీలు
సి. జారెడు కీలు డి. బొంగరపు కీలు
7. నాట్యంచేసేవారు అభినయించడానికి ఉపయోగించే కీలు ?
ఎ. బొంగరపు కీలు బి. మడతబందు కీలు
సి. జారెడు కీలు డి. బంతిగిన్నె కీలు
8. కీళ్ల మధ్య ఉన్న సెనోవియల్ ద్రవం అరిపోవడం వల్ల కలిగే వ్యాధి ?
ఎ. రికెట్స్ బి. ఆర్థరైటిస్
సి. ఆస్టియో ఆర్థరైటిస్ డి. ఫ్లోరోసిస్
9. తాళం వేసినప్పుడు, తీసినప్పుడు, వంగినప్పుడు ఎక్కువగా పనిచేసే కీలు ?
ఎ. జారెడు కీలు బి. మడతబందు కీలు
సి. బొంగరపు కీలు డి. బంతిగిన్నె కీలు
10. రక్తంలో యూరిక్ ఆమ్ల స్పటికాలు పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధి ?
ఎ. గేట్ బి. రికెట్స్
సి. ఫ్లోరోసిస్ డి. ఆర్థరైటిస్
11. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఆక్టిన్, మయోసిన్ కండరాలు పనిచేయకపోవడం వల్ల శరీరం గట్టిపడే స్థితి ?
ఎ. రికెట్స్ బి. టిటాని
సి. రిగర్ మెర్టిస్ డి. కండర గ్లానీ
12. ఒక వ్యక్తి పరిగెత్తి అలసిపోయినప్పుడు శరీర కండరాలలో
ఈ ఆమ్లం ఉత్పత్తి వల్ల నొప్పులు కలుగుతాయి ?
ఎ. పైరువిక్ ఆమ్లం బి. లాక్టిక్ ఆమ్లం
సి. మాలిక్ ఆమ్లం డి. పామిటిక్ ఆమ్లం
13. మానవునిలో లోపించిన ఎముక ?
ఎ. హ్యూమరస్ బి. ఆస్ట్రాగెలస్
సి. టిబియో డి. ఫిబ్యులా
14. స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం వేటి చలనాలను వివరిస్తుంది ?
ఎ. ఎముకలు బి. మృధులాస్థి
సి. అస్థి డి. కండరాలు
15. కండరాలకు వచ్చే క్యాన్సర్ ?
ఎ. కార్సినోమా బి. ల్యూకేమియా
సి. సార్కోమా డి. ఎనిమియా
సమాధానాలు : 1.సి, 2.డి, 3.సి, 4.బి, 5.బి, 6.డి, 7.ఎ, 8.సి, 9.ఎ, 10.ఎ, 11.సి, 12.బి, 13.బి, 14.డి, 15.సి.
- ఎ. ఉమామహేశ్వరరావు
సబ్జెక్టు నిపుణులు, తెనాలి.
సెల్ : 9985288150