చిన్నారి నేస్తాలూ,
ఈ నెలరోజులూ వేసవివిడిది పేజీ మిమ్మల్ని అలరించింది కదూ!? మీలో చాలామంది కథలూ, అనుభవాలూ, ఇతరత్రా కబుర్లూ రాసి పంపారు. పూర్తిగా మీ రచనలతోనే ఈ నెలరోజులూ ఈ పేజీ నడిచింది. పాల్గొన్న మీ అందరికీ అభినందనలు.
ఈ పేజీలో పాల్గొన్న చిట్టి రచయితలు, చిన్నారి చిత్రకారులు అందరికీ పుస్తకాలు కానుకగా పంపిస్తున్నాం. త్వరలో అవి మీకు చేరతాయి. పుస్తకం అందుకున్నాక- మాకు ఉత్తరం రాయండి. పోస్టుకార్డు కూడా జత చేశాం.
ఈ పేజీ నిర్వహణలో మీరంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు సంతోషం. చాలామంది చిన్నారులు చాలా బొమ్మలు గీసి, పంపారు. అన్నింటినీ ఈ పేజీలో ప్రచురించలేకపోయాం. బాగున్నవాటిని 'చిన్నారి' పేజీలో ప్రచురిస్తాం. ఈ రోజుతో వేసవి విడిదికి సెలవు. రేపటి నుంచి గతంలోలాగానే - ఈ పేజీ పూర్తిగా 'జీవన' కథనాలతో వస్తుంది. 'చిన్నారి' లోపలి పేజీలో వస్తుంది. చిన్నారి కోసం మీ రచనలు పంపిస్తూ ఉండండి. మెయిల్ ఐడి గుర్తుంది కదా..?! chinnaarips@gmail.com
త్వరలో పాఠశాలలు మళ్లీ మొదలవుతాయి కదా! కొత్త తరగతులు, కొత్త పుస్తకాలు, కొత్త స్నేహితులతో మీరంతా బిజీ అయిపోతారు. బోలెడు కబుర్లు కూడా చెప్పుకుంటారు కదా! మన 'వేసవి విడిది' సంగతులు కూడా మీ ఫ్రెండ్స్‌కి పంచటం మరచిపోకండి.
మీరంతా బాగా చదువుకోవాలని, ఆటపాటలతో
ఆనందంగా గడపాలని ఆశిస్తూ ... సెలవు!
- సంపాదకులు
టాటా.. బైబై.. వచ్చే వేసవిదాకా
