డిజిన్వెస్ట్మెంటుకు ఆమోదం పొందిన సంస్థలు
1. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్
2. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
3. చమురు, సహజవాయువుల సంస్థ
4. ఎన్‌హెచ్‌పిసి
5. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
6. గ్రామీణ విద్యుద్దీకరణ కార్పొరేషన్ లిమిటెడ్
7. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
9. మోయిల్ లిమిటెడ్
ఆధారం : పెట్టుబడుల ఉపసంహరణ విభాగం, ఆర్థికమంత్రిత్వ శాఖ
ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు)ల్లోని తమ వాటాల్లో కొంత భాగాన్ని విక్రయించాలన్న ప్రభుత్వ యత్నాలు ప్రారంభమయ్యాయి. మే మూడవ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) వాటాల విక్రయానికి పెట్టుబడుల ఉపసంహరణ విభాగానికి తన ఆమోద ముద్ర వేసింది. 20 ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించడానికి గ్రీన్ సిగల్ ఇచ్చింది. అప్పుడున్న ధరలను బట్టి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియతో ముందుకు సాగితే దాదాపు రూ.50 వేల కోట్ల వరకూ నిధులు సమకూరతాయని అంచనా వేశారు. దానితో అప్పుడు బడ్జెట్లో ఇచ్చిన కొన్ని వాగ్దానాలకు సరిపడా నిధులు లభ్యమవుతాయని భావించారు. అయితే కంపెనీల షేర్ల మార్కెట్ ధరలు కేబినెట్ ఆమోద ముద్ర వేసే సమయానికి ఉన్న మాదిరిగానే తర్వాత ఉండకపోవచ్చు. నిజంగానే ఆ ఊహాగానాలకు తగినట్లుగానే ఇటీవలి కాలంలో షేర్ మార్కెట్ బాగా క్షీణించింది. మార్చిలో 30 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ ఆ తరువాత బాగా పడిపోయింది. సెన్సెక్స్ మంచి ఊపు మీదున్న పరిస్థితిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తన అంచనాలను వేసి ఉండవచ్చు. ఒడుదుడుకులకు లోనైన మార్కెట్‌పై అంచనాలు క్షీణించడం ఈ ఏడాది మొదట్లోనే కనిపించింది.
రెండవది, ఊహించిన ధరలకే ఒకేసారి అంత పెద్ద మొత్తంలో వాటాలను మార్కెట్ ఇముడ్చుకోగలదా అనేది కూడా సమస్యే. పైగా, ఇంత పెద్ద మొత్తంలో వాటాల విక్రయాన్ని మదుపుదారులు కొనగలిగే సామర్థ్యంపైనా, ఆచరణలో వాటాల అమ్మకంలో ఉన్న ఇబ్బందులపైనా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ కారణాలు, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల అనుకున్న మేరకు లక్ష్యంగా పెట్టుకున్న మేరకు వేసిన లెక్కలన్నీ గతంలో మాదిరిగా నిరాశపరిచే రీతిలోనే ఉండబోతున్నాయి. అయితే, కేంద్రంలో ఏ సంకీర్ణం అధికారంలో ఉందనేదానితో నిమిత్తం లేకుండా వాటాల అమ్మకం కార్యక్రమం అమలులోనే ఉంది. స్టాక్ మార్కెట్‌కు సరైన సందేశం అందింది. పెట్టుబడులను ఉపసంహరించాలని ఎంపిక చేసుకున్న కంపెనీలు బహుశా మార్కెట్లకు అనుగుణంగా మారేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. గతంలో అనుభవాలను బట్టి చూసినట్లైతే, ఇది పెద్దగా దృష్టి కేంద్రీకరించాల్సిన విషయం కాదు.
డిజిన్వెస్ట్‌మెంట్‌ను అర్థం చేసుకోవడం
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించడం లేదా విక్రయించే క్రమాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇప్పటి వరకూ సేకరించిన పెట్టుబడుల మొత్తాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సాయపడతాయి. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత కూడా గతంలో కన్నా తన వద్ద తక్కువ వాటాలే ఉన్నప్పటికీ ప్రభుత్వం తన వద్దనే మెజారిటీ వాటాలను ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాలను నీరు గార్చడం కన్నా ఎక్కువగానే పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో కొన్ని షేర్లను విక్రయించడంతో పాటుగా గుర్తించిన యూనిట్ల వ్యూహాత్మక విక్రయాలు కూడా ప్రభుత్వం చేపట్టవచ్చని ఆర్థిక మంత్రి సంకేతాలిచ్చారు. ఈ రెండు క్రమాలు కూడా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో కొనసాగుతాయి. అయితే, వీటిల్లో కొన్ని గతంలోనే ఈ విభాగంలో ఉన్నాయి. పైగా వాటి గురించి తరచుగా వేరుగా చర్చించారు కూడా. మరింత సంప్రదాయ సిద్ధమైన పెట్టుబడుల ఉపసంహరణ పద్ధతులతో పాటు ఈ ఏడాది వ్యూహాత్మక విక్రయాలు, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విక్రయాల ద్వారా రూ.69,500 కోట్ల మేరకు పెట్టుబడులను సముపార్జించాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
51 శాతం వద్ద స్థిరంగా ఉండే వైఖరి
అత్యధిక భాగం కేసుల్లో, పెట్టుబడుల ఉపసంహరణ ముగిసిన తర్వాత ప్రభుత్వ యాజమాన్య వాటా కనీసం 51 శాతంగా ఉంటోంది. అందులో దేని కంటే కూడా ఎక్కువగా రాజకీయ ఒత్తిడి ఉంది. ఉదాహరణకు, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 51 శాతం ప్రభుత్వ వాటాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం పదే పదే తన సుముఖత వ్యక్తం చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అదనపు పెట్టుబడులను సమీకరించుకునేందుకు వీలుగా మరిన్ని పెట్టుబడుల ఉపసంహ రణ చర్యలు చేపట్టాలని ఆర్థిక తర్కం సూచిస్తోంది. అయితే, ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నప్పటికీ, తన వాటాలను 51 శాతానికి కన్నా తగ్గించుకోవడానికి అనుమతించరాదు.
సాధారణ సవాళ్ళు
ఇంత పెద్ద మొత్తం బడ్జెట్ లక్ష్యంతో, ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. వీటిల్లో కొన్ని సాధారణమైనవే. ఈ ప్రక్రియలో వారసత్వంగా వచ్చేవే. కానీ పెట్టుబడుల ఉపసంహరణను తీవ్రంగా విమర్శించేవారు ఈ క్రమాన్ని 'కుటుంబ నగలను (ఫ్యామిలీ జ్యూయల్స్)' విక్రయించడంగా వ్యాఖ్యానిస్తారు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అటు యూనియన్ల వద్ద కానీ, ఇటు రాజకీయనేతల వద్ద కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదనేది కూడా విమర్శకుల ఉద్ఘాటన. ఏ ప్రభుత్వ రంగ సంస్థలోనైనా వాటాలు విక్రయించడాన్ని రాజకీయ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడాన్ని చూస్తుంటాం. పైగా ఈ విమర్శలు కూడా వాటాల ధర, వాటిని విక్రయించే సమయానికి సంబంధించినవిగానే ఉంటాయి. ఆ రెండింటికి సంబంధించే విమర్శలు ఎక్కువ వస్తుంటాయి. సరైన ధర నిర్ధారించడం ఎన్నడూ అంత సులభం కాదు. ప్రభుత్వ ఆస్తులను చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఎప్పుడూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. రాజకీయ వర్గంలోని అత్యంత మేధో వర్గం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. అలా అమ్మడం గతంలో జరిగింది కూడా.
బుక్ బిల్డింగ్, తదితర ప్రక్రియల ద్వారా మార్కెట్ శక్తులే స్వయంగా విక్రయ ధరలను నిర్ణయించుకునేందుకు అనుమతిం చడం ద్వారా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నాలు జరుగు తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు అంతగా ఉపయోగపడడం లేదు. మరోవైపు, స్టాక్‌మార్కెట్లకు వర్తించే విస్తృత సాంకేతిక పరిజ్ఞానం చిన్న వాటాదారులను ఒంటరులను చేస్తున్నాయని చూపే సంఘటనలు కూడా లేకపోలేదు. చిన్నవారి ప్రయోజనాలను రక్షించేందుకు ఎంతో చేస్తున్నామని ఎంతో గొప్పగా చెబుతున్నప్పటికీ నిజ జీవితంలో జరిగింది మాత్రం చాలా స్వల్పమే. ఇస్యూలను జారీ చేసే సమయం కూడా విమర్శలకు మరో కీలక అంశంగా మారుతోంది. సరైన ధర నిర్ధారించడం, ఆ ధరకే అమ్మడం కన్నా మంచి సమయం మరేమీ ఉండబోదు. పర్యవసానంగా, ప్రభుత్వ నిర్ణయం నిష్ఫలమైందిగా మారింది. జవాబుదారీతనం వహించా ల్సిన అంశాలు - ప్రభుత్వ బ్యాంకులు తీసుకునే పరపతి నిర్ణయాల్లో ఇమిడివున్న అంశాల కన్నా ఏమంత భిన్నమైనవి కావు. అవి పెట్టుబడుల ఉపసంహరణ క్రమాన్ని నిరవధికంగా స్తంభింప చేయగలుగు తాయి. 'సాంప్రదాయిక' పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలో మాత్రమే వాటాలను విక్రయించి మెజారిటీ వాటాలను తన వద్దే ఉంచుకుంటుందనేది వివాదాస్పదమైనట్లైతే, వ్యూహాత్మక విక్రయాలు దాదాపు సాధ్యం కానివిగా మారతాయి. ఇక్కడ, ప్రభుత్వం మెజారిటీ వాటాపై నియంత్రణను వదులుకోవడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామిని నియంత్రించే అధికారం కూడా వదులుకోవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన వ్యూహాత్మక విక్రయాలేవీ కూడా తీవ్రమైన విమర్శలను తప్పించుకోలేకపోయాయి. ఆ
వివాదాలు ఈనాటికీ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు పతనావస్థలో ఉన్నాయి. ఇంకా ఇతర సాధారణ సవాళ్ళు వెంటాడుతూనే ఉన్నాయి.
(హిందూ సౌజన్యంతో..)
- సిఆర్ఎల్ నరసింహన్