బకాయి చెల్లించాలని ఉపాధి కూలీల ధర్నా
ప్రజాశక్తి - ఎస్.రాయవరం
మండలంలోని గుర్రాజుపేట గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు తమకు చెల్లించాల్సిన బకాయి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపిడిఒ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. గత 5 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, గ్రామానికి చెందిన విఆర్పి కొన్ని గ్రూపుల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రాజకీయంగా వివక్ష చూపుతూ కూలి డబ్బులు చెల్లించలేదన్నారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ మహిళల పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందించారు. సోమవారం లోపు సమస్య పరిష్కారం కాకపోతే వంటా వార్పు చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ధర్నాలో 30 మంది కూలీలు పాల్గొన్నారు.
బకాయి చెల్లించాలని ఉపాధి కూలీల ధర్నా
