కాకినాడ : స్థానిక జిల్లా క్రీడా సంస్థ ప్రాంగణంలో ఐసిఎఆర్ కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న సౌత్ జోన్ టోర్నమెంట్లో శనివారం నాలుగో రోజు విజేతలకు బహుమతులు అందజేశారు. వాలీబాల్, షూటింగ్, స్మాషింగ్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్ తదితర క్రీడల్లో సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చెస్ మహిళా విభాగంలో ఎన్ఎఎఆర్ ఉద్యోగి ఎన్.విజయలక్ష్మి ప్రథమ స్థానంలో నిలువగా సిటిఆర్ఐ ఉద్యోగి వి.భాగ్యలక్ష్మి ద్వితీయ స్థానంలో నిలిచారు. వాలీబాల్ స్మాషింగ్ విభాగంలో సిఐబిఎ టీము ప్రథమ స్థానంలో నిలవగా, ఐఎంఆర్ టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్, షూటింగ్ విభాగంలో సిటిఆర్ఐ సంస్థ టీమ్ ప్రథమ స్థానంలో నిలువగా ఐఐహెచ్ఆర్ సంస్థ టీమ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫుట్‌బాల్ విభాగంలో సిపిసిఆర్‌ఐ సంస్థ టీము ప్రథమ స్థానంలో స్థానంలో, సిటిసిఆర్‌ఐ బృందం ద్వితీయ స్థానంలో నిలి చాయి. బ్యాడ్మింటన్ సింగిల్స్ మహిళా విభాగంలో ఎన్ఎఎఉఆర్ఎం సంస్థకు చెందిన రుక్మిణి అమ్మాళ్ ప్రథమ స్థానంలో నిలువగా, ఐఐహెచ్ఆర్ సంస్థకు చెందిన సాయి మౌనిక ద్వితీయ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సిపిసిఆర్‌ఐ సంస్థకు చెందిన ప్రీతి, రమ్య ప్రథమ స్థానంలో నిలువగా ఐఐహెచ్ఆర్ సంస్థకు చెందిన సాయి మౌనిక లక్ష్మి, మీనాక్షి ద్వితీయ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో ఐఐఎస్ఆర్ టీము ప్రథమ స్థానంలో నిలవగా ఐఐఆర్ఆర్ టీము ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు సిటిఆర్ఐ డైరెక్టర్ దామో దర్ రెడ్డి, ఐఐఒపిఆర్ డైరెక్టర్ మాథుర్, ఐఐఒపిఆర్ పెదవేగి, ఐఐఆర్ఆర్ డైరెక్టర్ పార్వతీశం బహుమతులు అందజేశారు. ఐదో రోజైన ఆదివారం ఉదయం ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
సిఎం కప్ కబడ్డీ విజేతలు వీరే..
రాజమహేంద్రవరం అర్బన్ : స్ధానిక డిఎంహెచ్ స్కూల్లో శుక్రవారం జరిగిన రాజమహేంద్ర వరం నియోజకవర్గ స్థాయి సిఎం కప్ కబడ్డీ పోటీల విజేతలను టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎవిడి ప్రసాద్ శనివారం ప్రకటించారు. బాలికలు రెండు టీములు, బాలురు 8 టీములు తలపడ్డారని, బాలికల్లో విజేతలుగా శ్రీనన్నయ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల జట్టు, బాలుర కబడ్డీ విజేతలుగా ప్రతిభ పబ్లిక్ స్కూల్ జట్టు నిలిచారన్నారు. బాలుర జట్టు రన్నర్‌గా శ్రీనాగరాజు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, బాలికల కబడ్డీ రన్నర్స్‌గా పేపరుమిల్లు జట్టు నిలిచాయన్నారు.
అల్లవరం : అల్లవరం జెడ్పి ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సిఎం కప్ కబడ్డీ పోటీల్లో శనివారం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బి.వరహాలు ప్రారంభించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో 17 ఏళ్ల బాలుర విభాగంలో హర్ష విజ్ఞానభారతి, కొమరగిరిపట్నం విన్నర్‌గా నిలువగా రన్నర్స్‌గా జెడ్పిహెచ్ఎస్ అల్లవరం నిలిచింది. బాలికల విభాగంలో విన్నర్‌గా జెడ్పి హెచ్ఎస్, కొమరగిరిపట్నం, రన్నర్స్‌గా జెడ్పి హెచ్ఎస్ అల్లవరం నిలిచాయి.
జోనల్ స్పోర్ట్స్ బహుమతుల ప్రదానం
