రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ప్రజాశక్తి-పూసపాటిరేగ
మండలంలోని గురువారం కొప్పెర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాడ శేఖర్ (25) మృతిచెం దాడు. మృతుడుది మండలంలోని నడిపల్లి గ్రామం. రాత్రి ఏడు గంటలు సమయంలో ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వైపు వెళ్తున్నారు. జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి వెనుక నుండి లారీని ఢ కొట్టాడు. ఈ ప్రమాదంలో శేఖర్‌కు తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఇంటి నుండి బయలుదేరిన కుమారుడు నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడని తెలిసిన తల్లి గగ్గోలు పెడుతుంది. జాతీయ రహదిరిపై రక్తపు మడుగుల్లో విగత జీవిగా పడిఉన్న కుమారున్ని చూసిన ఆ తల్లి రోదన వర్ణణాతీతం. భర్తను కోల్పోయిన ఆమె కుమారుడిని కోల్పోవడంతో రోధన ఆపడం ఎవరితరం కావడంలేదు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం తరలించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
