కాకినాడ : పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లను చేపట్టడానికి రూ.22 వేల కోట్లు నిధులు ఖర్చు చేయడానికి అనుమతి ఇచ్చామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,100 కోట్లు అనుమతి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా విడుదల చేసిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలాఖరు నాటికి ఖర్చుచేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో బిసి సబ్ ప్లాన్ కింద రూ.11 వేల కోట్లు, ఎస్సి సబ్‌ప్లాన్ కింద రూ.10వేల కోట్లు, ఎస్టి సబ్‌ప్లాన్ కింద రూ.4 వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో బిసి కార్పొరేషన్ ద్వారా రూ.406 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా రూ.210 కోట్లతో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
లింకు రోడ్ల కోసం రూ.22వేల కోట్లు
