ప్రజాశక్తి- సంతబొమ్మాళి
మండలంలోని నగిరిపెంట గ్రామంలో శనివారం 132 పశువులకు జబ్బవాపు, గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు, 11 ఆవుదూడలకు బ్రూసెల్లోసిస్ టీకాలు వేశామని మండల పశువైద్యాదికారి ఎస్.కిరణ్కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించి పశువులకు టీకాలు వేస్తున్నామని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువులకు వ్యాధులు సోకకుండా టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది వీరాస్వామి, తిరుపతి పాల్గొన్నారు.
పశువులకు టీకాలు
