పాము కాటులో మనిషికి ఎక్కే విషం కన్నా... అతను పడే టెన్షన్ మరింత ప్రమాదకరమైనది. ఎలాంటి టెన్షన్‌కు గురి కాకుండా, నాటు వైద్యాల జోలికి పోకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్తే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తేలుగాని, పాము గాని కాటు వేసిన తర్వాత మొదటి గంట సమయంలోని ప్రతి నిమిషం ఎంతో విలువైనది. ఈ సమయాన్ని అశ్రద్ధ చేస్తే మనిషి ప్రాణానికే ముప్పు. పాము కాటేసిన వారికి ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరగకుండా గుడ్డతో గట్టిగా కట్టకూడదు. అలా కట్టాల్సివస్తే కనీసం చేతి వేలు పట్టేంత లూజుగా గుడ్డను కట్టాలి. కాటు వేసిన ప్రాంతంలో కోసి నోటి ద్వారా విషాన్ని పీల్చడం మరింత ప్రమాదకరర. పాము కాటేసిన వ్యక్తి కాలు కదపకుండా వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి. వైద్యులు వెంటనే పరీక్షించి విషం ఉన్నదో లేదో నిర్ధారించి విరుగుడుకు తగు చికిత్స చేస్తారు.
విషం కన్నా టెన్షన్ ప్రమాదకరం
-copy.jpg)