సూర్యుడు... సూర్యుడు
వెలుగునిచ్చే సూర్యుడు
మిలమిల మెరిసే సూర్యుడు
ప్రపంచాన్ని నిద్రలేపే సూర్యుడు
కాంతిని వెదజల్లే సూర్యుడు
తూర్పున ఉదయిస్తూ..
పశ్చిమాన అస్తమిస్తూ
కష్టసుఖాలను నేర్పే సూర్యుడు
మన జీవితాలలో వెలుగునింపే సూర్యుడు
- ఎన్. అంజలి,
8వ తరగతి,
ప్రాథమికోన్నత పాఠశాల,
కంకణాల పల్లె, ప్రకాశం జిల్లా.