ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రేవు ముత్యాలరాజు జెసి, ఆర్‌ఒలు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కోవూరు తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డితో సమీక్ష నిర్వహించారు. అనంతరం కోవూరులోని బాలికల అప్పర్ ప్రైమరీ స్కూల్, జెబిఆర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇను మడుగు ఎస్సి ఎయిడెడ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అనం తరం విడవలూరు తహశీల్దార్ కార్యాల యం సందర్శించారు. విడవలూరు మండలం, ముదవర్తిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రామతీర్థం పోలింగ్ కేంద్రాలను పరి శీలించారు. అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. . ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆదివారం నామినేషన్లు స్వీకరణ ఉండదు కాబట్టి ఆర్‌ఒలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 28వ తేదిన నామినేషన్ల ఉపసం హరణలుంటాయన్నారు. చివరగా కోవూరులో ఎన్నికల సంద ర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక ్పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.