శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

Mar 28,2024 12:25 #Nellore District

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు ఇస్తున్న ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరి నారాయణన్ తనిఖీలు చేసి ట్రైనింగ్ కు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్ ఓ, ఏపి ఆర్ ఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహాకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా రమేష్ ప్రేమ్ కుమార్, సహాయక రిటర్నింగ్ అధికారి నెహ్రూ బాబు పాల్గొన్నారు.

➡️