గండేపల్లి : సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్లో హాస్టల్ విద్యార్థులకు ఏటా నిర్వహించే ఆటల పోటీలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. క్యాంపస్ వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ పాల్గొనగా పోటీలను ఆనందోత్సాహాల మధ్య ఎంతో ఉత్సాహంగా ప్రారంభిం చారు. ఆదిత్య ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) పేరిట క్రికెట్ పోటీలు, ఆదిత్య ఫుట్బాల్ లీగ్ (ఎఎఫ్ఎల్) పోటీల్లో వివిధ జట్లను పరిచయం చేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ టికె.రామకృష్ణారావు మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదల స్నేహాభావానికి ఆటలు ఉపయోగ పడతాయన్నారు. విద్యార్థులకు పోటీతత్వం పెంపొందించేందుకు ఆదిత్య ప్రతిఏటా నిర్వహించే ఈ క్రికెట్ ఫుట్బాల్ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా సాగాల న్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ ఆశాశర్మ, జివి రామకృష్ణ, కోకోకోలా కంపెనీ ప్రతి నిధులు, హాస్టల్ చీఫ్ వార్డెన్స్ ఫిజికల్ డైరక్టర్లు, వివిధ జట్లకు సంబంధించిన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిత్యలో క్రీడలు ప్రారంభం
