సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరిశీలన
ప్రజాశక్తి - నెల్లూరు
వైద్య ఆరోగ్య శాఖలో మతా, శిశు మరణాల నివారణకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అధికారులు పరిశీలించారు. మంగళవా రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న స్టాప్నర్సులు, ఎఎన్ఎంల పనితీరును కుటుంబ సంక్షేమ శిక్షణ కార్యాలయానికి చెందిన అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో మరణాల రేటు 154 ఉండగా ఇప్పుడు 74కు చేరిందన్నారు. అదే విధంగా శిశు మరణాల రేటు 59 నుంచి 31కు తగ్గిందన్నారు. జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్సెంటర్ల స్థాయిలో, ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు. గర్భిణులుగా నమోదైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శిక్షణ కార్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ రామసుబ్బారావు, సిహెచ్ నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రభాకరరావు పాల్గొన్నారు
సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరిశీలన
