ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్కుమార్గాంధీని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎఎస్‌ల బదిలీలో భాగంగా జెసి పి.కోటేశ్వరరావును ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా నియమించింది. ఈయన జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మూడేళ్లకుపైగా పనిచేశారు. 2015 జనవరి 22న జెసిగా కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. పోలవరం నిర్వాసితుల పునరావాసం వంటి కీలకమైన పనులన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన స్థానంలో జెసిగా ఎనర్జీ ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఎం.వేణుగోపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. నరసాపురం సబ్‌కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌గాంధీ 2016 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టగా ఏడాదిన్నరపాటు జిల్లాలో పని చేశారు. ఈయనను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నరసాపురం సబ్‌కలెక్టర్‌గా ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. ఇరువురు అధికారులు సోమవారం బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నట్లు తెలిసింది.
కొత్త జెసిగా వేణుగోపాల్‌రెడ్డి
