ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
నల్లగొండ జిల్లా సూర్యపేటలో ఆలిండియా రేడియో స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివ ద్ధి, సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వీలైనంత త్వరగా రేడియో స్టేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2016 డిసెంబర్ నాటికి ప్రసార కేంద్రం, పరికరాలు సిద్ధమవుతాయని వెంకయ్యకు అధికారులు తెలిపారు. ట్రాన్స్మీటింగ్ టవర్ నిర్మాణానికి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి చెప్పారు. నల్లగొండ లోక్‌సభ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇచ్చిన రిప్రజెంటేషన్‌ను పరిశీలించిన తరువాత నిర్ణయం వెల్లడించారు.
సూర్యాపేటలో రేడియో కేంద్రం
