ఎవరైనా కాలేజ్‌లో చేరే ముందు మ్యాథ్స్, సైన్స్, కామర్స్ ఇలా తమకు ఇష్టమైన సబ్జెక్ట్స్‌కు సంబంధించిన గ్రూపులను ఎంచుకుంటారు. కానీ, స్తావి ఆస్థానా మాత్రం తన అభిమాన క్రీడ హార్స్ రైడింగ్‌కు అవకాశమిచ్చే కాలేజీని ఎంచుకుంది. అసలు భారత్‌లో ఈ తరహా క్రీడలో కనిపించే అమ్మాయిలూ అరుదే. అలాంటి అరుదైన క్రీడ కోసం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లాలో చేరి గుర్రపు స్వారీలో పట్టు సాధించింది. స్వయంకృషితో ఎఫ్ఇఐ ప్రపంచపోటీల్లో పాల్గొని వరల్డ్ నెంబర్-3 స్థానంలో నిలిచింది స్తావి. ఆమె పరిచయం ఈ వారం మీ కోసం.
్య స్తావి ఆస్థానా (19) లక్నోకు చెందిన అమ్మాయి.
్య అమ్మానాన్నలిద్దరూ సివిల్ సర్వెంట్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
్య తన ఎనిమిదేళ్ల వయసులో అమ్మానాన్నలతో కలిసి తొలిసారి గుర్రంపై స్వారీ చేసింది ఆస్థానా.
్య అప్పటి నుంచే తనకు గుర్రపు స్వారీపై ఆసక్తి కలిగింది. ఇంటికి దగ్గర్లో ఒక పోలీస్ గ్రౌండ్స్ ఉండటంతో తన ఎనిమిదేళ్ళ వయసు నుంచే పోలీసులు ఉపయోగించే గుర్రాలపై హార్స్ రైడింగ్‌లో శిక్షణ మొదలు పెట్టింది.
్య అయితే తనకు కోచ్ ఎవరూ లేరు. ఇంటర్నెట్ ద్వారానే గుర్రపు స్వారీకి సంబంధించిన విషయాలను తెలుసుకునేది. దాదాపు తన శిక్షణంతా అలానే కొనసాగింది.
్య అలా తొలిసారిగా 2009లో ఢిల్లీలో జరిగిన ఈక్వెస్ట్రియన్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. గుర్రపు స్వారీకి సంబంధించిన పోటీల్లో పురుషులు, మహిళలకు సమానమైన పోటీలు నిర్వహించేది ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్‌లోనే....
్య ఈ విజయం తర్వాత తను ఇక వెనుదిరగలేదు. అలా 2011 వరకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలను గెలుచుకుంది.
్య 2011-2012లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంది స్తావి. మిలిటరీ, పారా మిలిటరీ, పోలీస్, రాష్ట్రపతి రక్షణా దళంలోని టాప్ రైడర్స్ పాలొన్న ఈ పోటీల్లో నోవిస్ జంపింగ్ టీమ్ తరపున ఆడి రజత పతకాన్ని సొంతంచేసుకుంది. అప్పటికి స్తావి వయసు 16 సంవత్సరాలు. ఈ విజయం తను గుర్రపు స్వారీల్లో కొనసాగడానికి మరింత ధైర్యాన్ని అందించింది.
్య 2012-2013 సంవత్సరానికి గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఝాన్సీలక్ష్మీభారు స్పోర్స్ట్ అవార్డును అందుకుంది స్తావి.
్య హార్స్ రైడింగ్ కోసం తను చదువును నిర్లక్ష్యం చేయలేదు.
్య 2012-2013 ఏడాదిపాటు చదువు కోసం హార్స్ రైడింగ్ పోటీలకు దురంగా ఉన్నా తిరిగి 2014లో రెట్టింపు వేగాన్ని పుంజుకుంటూ పోటీల్లోకి అడుగు పెట్టింది.
్య అలా 2014లో జరిగిన జాతీయస్థాయి ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంది. జూనియర్స్ విభాగంలో నిర్వహించిన వివిధ పోటీల్లో ఒక బంగారు, రెండు రజత, ఒక కాంస్య పతకాన్ని సొంతంచేసుకుంది. అదే సంవత్సరం ఎఫ్ఇఐ వరల్డ్ డ్రిసేజ్ చాలెంజ్ పోటీల్లో ప్రిలిమినరీ సీనియర్ క్లాస్ సెక్షన్ విభాగంలో పాల్గొని వరల్డ్ నెంబర్ -3 టైటిల్‌ను సొంతంచేసుకుంది.
్య 2015లో జరిగిన జూనియర్స్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు, ఒక రజత
పతకాన్ని దక్కించుకుంది.
్య 2016లో జరిగిన నేషనల్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.
్య డిహెచ్ఎస్ (ఢిల్లీ హార్స్ షో), ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్, ఎఫ్ఇఐ వరల్డ్ డ్రిసేజ్ చాలెంజ్ ఇలా వివిధ పోటీల్లో బార్ జంపింగ్, లాంగ్ జంప్ ఇలా వివిధ విభాగాల్లో పోటీపడి ఇప్పటి వరకు దాదాపు 72 పతకాల్ని, ఐదు ట్రోఫీలను సొంతం చేసుకుందంటే ఈ క్రీడలో తను ఎంతటి ప్రతిభ కనబరుస్తోందో అర్థంచేసుకోవచ్చు.
్య ఈ క్రీడలో మరింత మెరుగైన శిక్షణ అవసరమవడంతో గుర్రపు స్వారీలోనూ శిక్షణ ఇచ్చే యూనివర్సిటీలో తన చదువు కొనసాగించాలనుకుంది. అలా ఢిల్లీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లాలో చేరింది స్తావి. ఇక్కడ ఉదయం.5 గంటలకే హార్స్‌రైడింగ్ శిక్షణ ప్రారంభమయ్యేది. తొమ్మిదింటి నుంచి లా తరగతులకు వెళ్ళాల్సి వచ్చేది. ఇలా రోజు మొత్తంలో ఎక్కువ సమయం కష్టపడాల్సి వచ్చేది. అయినా తనెప్పుడు వెనుదిరగలేదు.
్య 2015లో జర్మనీలో జరిగిన ఇఎఫ్ఐ ట్రెయినింగ్ ప్రోగామ్కు ఎంపికైంది స్తావి. మూడు వారాల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అందుకోసం తనే సొంతగా డబ్బును సమకూర్చుకోవాల్సి వచ్చింది.
్య మన దేశంలో హార్స్ రైడింగ్‌కు సరైన శిక్షణ ఇచ్చే సంస్థలే కాదు, సరైన వసతులు కూడా లేవంటారు స్తావి. ప్రభుత్వం సరైన వసతులు కల్పిస్తే తనలా మరెందరో అమ్మాయిలు ఈ క్రీడలోకి అడుగుపెడతారనేది స్తావి నమ్మకం.
్య 2018లో జరగనున్న ఏషియన్ గేమ్స్ కోసం మరిన్ని మెలకువలను నేర్చుకుంటోంది స్తావి.
దమ్మున్న హార్స్ రైడర్
