రొయ్యల కూర
కావాల్సిన పదార్థాలు
పచ్చి రొయ్యలు-1/2 కేజీ ( శుభ్రం చేసి పసుపు ఉప్పు కలిపి పక్కకు పెట్టాలి)
ఉల్లిపాయలు-2
పచ్చిమిర్చి-5
అల్లం వెల్లుల్ల పేస్టు-2 చెంచాలు
చిటికెడు పసుపు
కారం- 4 చెంచాలు
ధనియాల పొడి-1 చెంచా
మసాలా పొడి- 1 చెంచా
నూనె- తగినంత
ఉప్పు- తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
తయారీ
మామిడికాయను మెత్తగా పేస్టు చేసుకోవాలి. గిన్నెలో నూనె వేసి కాగాక మొదట సన్నగా తరిగిన ఉల్లి పాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. తరువాత రొయ్యలు వేసి బాగా వేగాక మామిడి కాయ గుజ్జు కూడా వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి వేసి నీరంతా ఇంకిపోయాక కొత్తిమీర వేసి దించాలి.
మటన్
బోన్లెస్ మటన్- అర కేజీ
మామిడికాయ- 1
ఉల్లిపాయలు-2
పచ్చిమిర్చి-5
అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు
పసుపు- చిటికెడు
ధనియాల పొడి- ఒక చెంచా
మసాలా పొడి- ఒక చెంచా
ఉప్పు- తగినంత
కొత్తిమీర- ఒకటి
తయారీ
ముందుగా మటన్ శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. మామిడి కాయని చెక్కుతీసి ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. మూకుడులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగాక ఉడికించిన మటన్ వేసి మరో 5,6 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మామిడి కాయ గుజ్జు వేసి ధనియాల పొడి, కారం, ఉప్పు, మసాలా పొడి వేసి బాగా దగ్గరకు అయ్యే వరకు స్టౌ మీద ఉంచి కొత్తిమీర వేశాక స్టౌ మీద నుంచి దించాలి.
చేపల కూర
కావాల్సిన పదార్థాలు
మామిడి కాయ- ఒకటి
శుభ్రం చేసిన చేప ముక్కలు- 1/2 కిలో
ఉల్లిపాయలు- రెండు (పేస్టు)
పచ్చి మిర్చి-ఐదు
అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు
కొత్తిమీర కట్ట- ఒకటి
ఉప్పు- తగినంత
నూనె- 1/4 కప్పు
మసాలా పొడి-ఒక చెంచా
తయారీ
చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం వెల్లుల్లి, అల్లం పేస్ట్ పట్టించి ఒక గంట పక్కకు పెట్టాలి. మామిడికాయ చెక్కు తీసి ముక్కలు కోసుకుని పేస్టులా చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉల్లిపాయ పేస్టు వేసి వేయించాలి. అది దోరగా వేగాక అల్లం- వెల్లుల్లి పేస్టు పచ్చి మిరపకాయ, కారం వేసి వేగిన తరువాత చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కల్ని చిదమకుండా ఇరువైపులా వేయించాలి. ఉప్పు, మామిడి కాయ గుజ్జు వేసి దగ్గరగా అయ్యాక ఉప్పు మసాలా పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. పైన కొత్తిమీర అలంకరించి వేడి వేడి అన్నంలోకి వడ్డించండి.
మామిడితో నాన్-వెజ్ మజా
