ఇట్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్నారు పెద్దలు! వాటిలో ఉండే కష్టనష్టాలు దృష్టిలో పెట్టుకుని! కాని అది ప్రస్తుతం పాత బడిన సామెత లా మారింది. ఇల్లు కట్టుకోవడమూ, పెళ్ళి చేసుకోవడమూ రెండు ఇప్పుడు సునాయసంగానే జరిగిపోతున్నాయి.
ఒక ఇల్లు గానీ మరేదైనా నిర్మాణం గానీ జరిపించాలంటే భూమిలో పునాదులు నుండి పైకప్పు వరకూ ఎంతో వ్యవధి అవసరమయ్యే ప్రక్రియలు ఇమిడి ఉండే కార్యక్రమం. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. కానీ క్రమేపీ ఆ పద్ధతి మారుతోంది.
మనుషులతో తవ్వే బదులు భారీ యంత్రాలు వచ్చాయి. వారాలు పట్టే చదును చేయడాలు, పునాదులు తవ్వడాలూ వంటివి కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి. నిర్మాణం దగ్గర కలిపే కాంక్రీటు ఇప్పుడు ఎక్కడో ముందుగానే కలపబడి అందుబాటులోకి వస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వారాల తరబడి నీళ్ళతో తడిపే అవసరం లేని రెడీమేట్ కాంక్రీటు లభ్యమయింది. హైదరాబాద్ మెట్రో పిల్లర్లు ఈ తరహ కాంక్రీటుతోనే ధృడంగా తయారు చేశారు. అలాగే నిర్మాణానికి అవసరమైన అనేక భాగాలను గోడలూ, గుమ్మాలు, తలుపులూ వంటివి మరెక్కడో ముందే తయారు చేసిన వాటిని తీసుకువచ్చి అమర్చే విధంగా రూపొందిస్తున్నారు.
ఈ పద్ధతుల వలన నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. ఈ టెక్నాలిజీని ప్రీకాస్ట్ టెక్నాలజీ అంటున్నారు. దీని వల్ల కూలీల సమస్య, నాణ్యత సమస్య, సమయాభావం వంటివన్నీ తీరిపోతాయి. ఒక నిర్మాణం సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కంటే 65 శాతం వేగంగా ప్రీకాస్ట్ టెక్నాలజీతో పూర్తి చేయవచ్చు. అంటే మామూలు నిర్మాణాలు పూర్తవడానికి ఒక సంవత్సరం పడితే ప్రీకాస్ట్ తో కేవలం నాలుగు నెలల్లో ముగించవచ్చు. పైగా మరింత ధృడంగా నాణ్యంగా, దీర్ఘకాల మన్నికతో మరో విశేషం ఏమిటంటే ఈ కొత్త తరహ నిర్మాణ పద్ధతిలో నిర్మాణ వ్యయం 10-15 శాతం తగ్గుతుంది కూడా!
రికార్డులు
కొత్త తరపు నిర్మాణ ప్రక్రియగా భావిస్తున్న ప్రీఫాబ్ టెక్నాలజీ సాయంతో చాలా అద్భుతంగా జరిగాయి. ఒక ఫ్యాక్టరీలో విడిభాగాలన్నీ రూపొందించి అసలు నిర్మాణ ప్రదేశంలో వాటిని అమర్చడం ఈ పద్ధతిలో కీలకం. ఈ పద్ధతిలో అతి వేగంగా నిర్మించిన మూడు నిర్మాణాలు ఇవి. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో 2011లో 328 అడుగుల ఎత్తున్న 30 అంతస్తుల ''టి 30'' భవంతి 15 రోజులల్లో పూర్తయింది. ఇది ప్రపంచంలో మూడవ అతి వేగవంతమైన నిర్మాణం చేసుకున్న భవంతి. చైనాలోని ''మినీ స్కై సిటీ'' అనే మరొక 57 అంతస్తుల భవంతి రూపుదిద్దుకుంది. దీని కోసం వెచ్చించింద 19 రోజులు మాత్రమే ఈ భవంతిలో 800 అపార్ట్మెంట్లున్నాయి. ఒకటవ స్థానం మనమే! మోహాలీలో నిర్మించిన 10 అంతస్తుల భవంతి ప్రపచంలో అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకుంది. ఇది పూర్తి కావడానికి పట్టిన సమయం -రెండు రోజులు. చైనాలోని 30 అంతస్తుల హోటల్ 1,83,000 చదరపు అడుగుల విస్తరించుకుని ఉంది. దానికి నిర్మించడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం 15 రోజులు అంటే 360 గంటలు. ఇంత అద్భుతాన్ని చేసే క్రమంలో ఒక్క పనివాడికి కూడా కనీసం గాయమైనా కాలేదు. ఈ 30 అంతస్తుల హోటల్ 2వ స్థాయి భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలదు. ఇందులోని గోడలన్నీ సౌండ్ ప్రూఫ్ లోపల గాలి నాణ్యత నియంత్రణ వ్యవస్థ కూడా ఉంది. మన దేశంలో చండీగఢ్‌లో కేవలం 48 గంటల్లో 25,000 చదరపు అడుగుల భవంతిని కట్టేశారు. ఈ సది అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి 200 మంది రెండు రోజులు పని చేశారు. ఇతర సాధరణ నిర్మాణాల మాదిరిగా నీరు కారణం, గోడల్లో చెమ్మ చేరడం, సన్నని పగుళ్ళు రావడం వంటివి అస్సలుండవని అంటున్నారు. ఇంతవరకు అటువంటివి అనుభవంలోకి రాలేదు.దాదాపు 600 సంవత్సరాల వరకు ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుందని ఇంజనీర్లు ధీమాగా ఉన్నారు.
ఇలా స్పీడుగా కట్టడం రికార్డుల కోసమే కాకుండా అవసరం కూడా కావచ్చు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి జరిగే ఆస్తినష్టాన్ని భర్తీ చేయడానికి వసతి కోల్పోయిన బాధితులకు సత్వరమే వసతి కల్పించడానికి కూడా ఇటువంటి స్పీడు గృహలు అవసరమౌతాయి. రెండేళ్ళ క్రితం ఉత్తరాఖాండ్ వరద భీభత్సం మూలంగా సుమారు 3,000 కుటుంబాలు గృహలు కోల్పోయాయి. ఆ ప్రాంతంలో దాదాపు 2500 ప్రీ ఫాబ్రిక్ గృహలు ఏడాది ఆఖరికు తయారయ్యాయి. భవిష్యత్తులో ఈ తరహ కాలనీలు బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం విస్తరించింది. ప్రజాదరణ పొందడానికి కాస్త సమయం పట్టవచ్చు. ప్రతి కొత్త పద్ధతికి ఉండేలాగా దీనికి ముందుగా వ్యతిరేకత ఎదురవ్వచ్చు. ఆ అనుమానాలు ఆధారంగా నిర్మా ణాల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. మొత్తానికి ఇల్లు కట్టుకోవడానికి వారం పదిరోజులకంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
రెడీమేడ్ ఇళ్లు
మన దేశంలో ''ఇండియా కాన్సెప్ట్ హౌజ్'' పేరుతో అందుబాటు ధరల్లో అందరికి గృహలనే ఆలోచన ఉంది. ఈ పద్ధతిలో మొత్తం గృహం ఫ్యాక్టరీలో తయారౌతుంది. ఎక్కడ కావాలో అక్కడ దాన్ని అమర్చుతారు. మాడ్యులర్ తరహలో ఉండటం వలన ఈ ఇళ్లను ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు పెంచుకోవచ్చు. ఒక వంద చదరపు గజాల ఇంటిని 5-6 వారాలల్లో అమర్చుకోవచ్చు. మనకి ఇటువంటి ప్రీ ఫాలిక్రేటెడ్ నిర్మాణాలు కొత్తమే కాదు. ''ఫాల్స్ రూఫ్'' ఆఫీసుల్లో క్యాబిన్లు, వంటగదుల్లో అలమారాలు, ఆసుపత్రుల్లో గదులు... ఇలా తేలికపాటి ప్యానెళ్లతో తయారైనవే. ఇప్పుడు ఫ్లైఓవర్లు, రైలు మార్గాలు బహుళ అంతస్తుల భవనాలు కూడా ఇదే టెక్నాలజీతో తయారౌతున్నాయి. రానున్న కాలంలో ఈ తరహ నిర్మాణాలు మరింత వేగం పుంజుకుని విస్తరిస్తాయి. కానీ ఇల్లంటే ఇటుకా, ఇసుకా, సిమెంటు లేకుండా ఊహించలేని వారికి ఇటువంటి ప్రీఫాల్ ఇళ్ళు ఆనవేమో! పైగా 'వారంలో కట్టిన ఇల్లు నెల లోపు కూలదా?' అనే వారూ ఉంటారు. ఏదేమైనా రానున్న సాంకేతిక విప్లవాన్ని ఆపేదెవరు?
- డా|| కాకర్లమూడి విజయ్
