'ఐ డోంట్ లవ్ ఓన్లీ మేక్ లవ్' అంటున్నారు నాగార్జున. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నాగార్జున వర్జిన్ యువకుడిగా బయటకు కనపడతారు, కానీ మరో పక్క అమ్మాయిల వెంటపడే పాత్రలో కనపడుతున్నారు. ఇలాంటి బోల్డ్ రోల్లో నాగార్జున నటించడం ఇదే తొలిసారి. టీజర్‌ను చూస్తుంటే సినిమాను లావిష్‌గా తెరకెక్కించారని అర్థమవుతుందని నిర్మాత తెలిపారు. సినిమాటోగ్రఫీ పెద్ద ఎసెట్‌గా కనపడుతుందన్నారు. ''ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా??'' ''పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్‌కు దిగుతున్నావ్!'' అంటూ టీజర్లో చూపించారు. సింగిల్ షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. సీనియర్ నటి లక్ష్మి, వెన్నెల కిశోర్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఐ డోంట్ లవ్... ఓన్లీ మేక్ లవ్
