గరీబోళ్ల పిల్లలను ఐఐటీలో చదివేలా కోచింగ్ ఇస్తున్న మ్యాథ్మెటిషియన్ ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా 'సూపర్ 30'. బీహార్‌కు చెందిన ఈ ఆనంద్ ఇప్పటికే ఎంతోమంది పేదల పిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు. దానికి ఆయన ఎంత శ్రమిస్తున్నారో, ఆ కార్యక్రమానికి ఎవరు నుంచి స్ఫూర్తిపొందారో వెండితెరపై చూడబోతున్నారు. ఆనంద్‌గా హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం జూలై 26న విడుదల చేయబోతున్నారట. ఈ విషయం చిత్రనిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా రాలేదు కానీ ప్రచారం జరుగుతోంది. వికాస్ బV్‌ా్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతోంది. మీటూ ఉద్యమం నేపథ్యంలో వికాస్ బV్ా్లపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తరుణంలో ఈ చిత్రం నుంచి ఆయన్ని తొలగించారు కూడా. ఆ ఆరోపణలు నిజం కాదని తేలే వరకూ చిత్రీకరణ కొనసాగించొద్దని హృతిక్ అప్పట్లో చెప్పారు. తర్వాత ఆయనతోనే ఈ సినిమా చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రబృందంలో ఒక్కరైన షిబాసిష్ సర్కార్ మాట్లాడుతూ 'నిబంధనలు ప్రకారం ఈ చిత్రం పూర్తికావడానికి బయట నుంచి ఎవరినీ దర్శకుడిగా నియమించుకోలేదు. స్టూడియో పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే ప్రక్రియలో ఉంది'' అని తెలిపారు.
జూలై 26న 'సూపర్ 30'
