-నబి యేనుగుబాల
'సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా 'మసక్కలి'. ఒక అమ్మ కోణంలో 'అర్జున్ రెడ్డి' సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. 'మసక్కలి' అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఒక అమ్మాయిని, సమాజాన్ని అంత స్వచ్ఛంగా ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిల మధ్య సాగే కథ ఇది. కొన్ని కథలు విని నమ్ముతాం. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి.. అలాంటిదే నా ఈ కథ' అని అన్నారు 'మసక్కలి' చిత్ర దర్శకుడు నబి యేనుగుబాల. డూ గూడ్ ఫాలో రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోంది. సాయి రోనక్, శ్రావ్య, శిరీషా వంకా, కాశీ విశ్వనాథ్, నవీన్, రవివర్మ, రామ్ జగన్, దేవదాస్ కనకాల, నరసింహరాజు, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.
యేనుగుబాల మాట్లాడుతూ ''అంతర్లీనంగా సందేశం ఉన్నా.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. మంచి కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఉంటుంది. కానీ ఏదీ కథను దాటి వెళ్లదు. అబ్బాయి మాత్రమే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అమ్మాయి అతన్ని ప్రేమించదు. ఆ కుర్రాడు సైకాలజీ స్టూడెంట్‌గా ఓ డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా ఉంటాడు. ఆ డాక్టర్ ఇచ్చిన ఓ కేస్‌ను ఛేదించే క్రమంలో అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది. ఈ అమ్మాయి ద్వారా తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది కథ. మా నిర్మాతకు సామాజిక బాధ్యత ఎక్కువ. అందుకే అలాంటి కథలే కావాలన్న ఆయన కోరిక మేరకు అన్ని అంశాలున్న ఈ కథ సిద్ధమైంది. అందమైన విజువల్స్‌తో పాటు మంచి సంగీతం ఉంటుంది. ఇప్పటికే కొందరికి ఈ సినిమా చూపించాను. వాళ్లంతా హార్ట్ టచింగ్ మూవీగా చెప్పారు. తక్కువ బడ్జెట్లోనే పెద్ద సినిమా స్థాయిలో క్వాలిటీ ఉంటుంది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. స్టోరీకి అనుగుణమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను'' అని తెలిపారు.
'మసక్కలి' స్వచ్ఛమైన ప్రేమకథ
