అలియా భట్, మాధురి దీక్షిత్ కలసి త్వరలో ఒకే పాటలో అదీ కథక్ డాన్స్ చేయబోతున్నారు. అది ఆ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందట. చాలా కాలం తర్వాత కరణ్ జోహార్ ఓ పిరియాడికల్ చిత్రం చేస్తున్నట్టు గత ఏడాది ప్రకటించారు. అదీ మల్టీస్టారర్. ఇందులో సంజరు దత్‌కు జోడీగా మాధురి దీక్షిత్ చేయబోతుంది. ఇందులో అలియా భట్, సోనాక్షి సిన్హా , అదిత్యా రారు కపూర్, వరుణ్ ధావన్, కియార అద్వాని తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అలియా భట్, మాధురి దీక్షిత్ కాంబినేషన్లో కథక్ డాన్స్‌ను రూపొందించబోతున్నారు. కథక్‌లో మాధురి ఇప్పటికే మంచి ప్రావీణ్యత సంపాదించారు. అలియా భట్ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఒక్క పాట కోసమే అలియా రెండు నెలలుగా కథక్లోనే శిక్షణ పొందుతోంది. అంటే ఈ గీతానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో అర్ధమవుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథక్ డాన్స్‌తో మెప్పిస్తారా?
