బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ చేస్తోన్న సినిమా 'సూపర్ 30'. మేథమెటిషియన్ ఆనంద కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. బీహార్‌లో ఏటా 30 మంది పేద విద్యార్థులకు ఐఐటీ ప్రవేశానికి ఉచితం కోచింగ్ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆనంద కుమార్. ఈ చిత్రంలో హృతిక్ ఆనంద కుమార్ పాత్రలో కనిపించబోతున్నాడు. బుధవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కొన్ని కొటేషన్లతో మొత్తం మూడు పోస్టర్లను ట్విట్టర్లో విడుదల చేశారు హృతిక్. 'రాజు కొడుకు రాజు కాలేడు. అర్హులే రాజు అవుతాడు. సమయం మారుతూ ఉంటుంది' అని పోస్టర్లలో రాసుంది. ప్రతి పోస్టర్‌పైనా మేథమెటిక్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి వికాస్ బాV్‌ా్ల దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మెత్వాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. మృనల్ తకుర్, వీరేంద్ర సెక్సేనా, పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజరు అటుల్ బాణీలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజు కొడుకు రాజు కాలేడు
