బ్రిటిష్ వారిని గడగడలాడించిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'మణికర్ణిక'. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో లక్ష్మీబాయిగా కంగన లుక్ ఆకట్టుకుంటోంది. గుర్రంపై కత్తి పట్టుకుని పోరాడుతున్నట్టు ఉన్న లుక్ హైలైట్‌గా నిలిచింది. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోనూ సూద్ సదాశివ్ అనే మరాఠీ రాజు పాత్రలో నటిస్తున్నారు. 2019 జనవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి
