ఎన్టీఆర్ జీవితం ఆధారంగా అదే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. విద్యాబాలన్ బసవతారకంగా నటిస్తున్నారు. క్రిష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందుకురి నిర్మాతలు. ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో రానా మెప్పించబోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శుక్రవారం ఈ సినిమా సెట్లో క్రిష్, బాలకృష్ణ కలిసి దిగిన సెల్ఫీని రానా ట్విటర్లో పోస్ట్ చేశారు. 'గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను మీకు చెప్పేందుకు మేం కలిశాం' అని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో చక్రపాణిగా మురళీశర్మ, హెచ్.ఎం.రెడ్డిగా కైకాల సత్యనారాయణ, నాగిరెడ్డిగా ప్రకాశ్ రాజ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
చంద్రబాబు వచ్చేశారు
