డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం 'పి.ఎస్.వి.గరుడవేగ 126.18'. పూజా కుమార్ హీరోయిన్గా నటిస్తుంది. ఉన్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కిషోర్ అత్యంత బలమైన ప్రతినాయకుడు జార్జ్ పాత్రలో కనపడనున్నారు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో 'చీకటి రాజ్యం' 'కబాలి' వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో కిషోర్‌కు ఈ జార్జ్ పాత్ర మైలురాయిలా నిలిచిపోతుందని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. పాత్ర గురించి చెప్పాలంటే.. జార్జ్, రాక్షసుడి మానవ రూపం.. అతని ఆలోచన కపటం, ఒళ్ళు విషం, అతనితో పొత్తే వినాశనం... శారీరకంగా అవిటివాడు కావచ్చు, కానీ మానసికంగా అత్యంత బలవంతుడు, అతని బుద్ధితో ఢ కొట్టి గెలవడం అసాధ్యం.. అతనితో బేరానికి దిగలేరు, భయపెట్టి బతకలేరు.. వేటకు దిగిన మగం కంటే క్రూరుడు... జాలి, దయ, ప్రేమ, కరుణ అతని చరిత్రలోనే లేవు అనేలా భారతీయ చలనచిత్రలో అత్యంత గొప్ప ప్రతినాయకులైన మొగాంబో, గబ్బర్ సింగ్‌ని తలపిస్తుంది. కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు.
క్రూరుడుగా కిషోర్
