ఏ సమస్యకైనా పరిష్కారాన్ని మంచి లక్ష్యం, నిష్పాక్షికమైన కోణంతో ఆలోచించాల్సి ఉంటుంది. నేటి సమాజంలో అత్యధిక మంది సమస్యను రెండు వైపులా పరిగణలోకి తీసుకోకుండానే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు. చిన్న తనం నుండి ఏకపక్ష ధోరణులతో సాగిన రచనలని మనం చదువుతూ పెరగడమే ఏకపక్ష నిర్ణయాలకి కారణమవుతున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ధోరణుల్లో మార్పు తెచ్చేందుకు ది హిస్టరీ ప్రాజెక్ట్ ద్వారా కృషిచేస్తున్నారు క్వాసిమ్, అయాజ్, జోయ సిద్దికి.
విద్యార్థి దశలో ఎవరినైనా ఇష్టం లేని సబ్జెక్ట్ ఏదని అడిగితే అందరినోటా వినిపించే పదం హిస్టరీ. ప్రతి జాతి చరిత్రకి సంబంధించిన వివరాలు ఆ దేశానికే గుర్తింపుగానిలుస్తాయి. మన ప్రస్తుత స్థానం గతంలో మనం తెలుసుకున్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. గత చరిత్ర ప్రాధాన్యతని, వర్తమాన సంఘటనలతో పాటు భవిష్యత్తులో మనం చేయబోయే చర్యలకి మార్గదర్శకాన్నిచ్చే ఈ చరిత్ర పాఠాలని ఏకపక్ష రచనల ద్వారా తెలుసుకోవడం వల్ల ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రచారమవుతూ విద్యార్థుల్లో పొరుగు దేశాలపై ప్రతి కూల భావనని నింపుతున్నాయి. సొంత పరిశీలన, అధ్యయనం, చర్చల ద్వారా ఇలాంటి ధోరణుల నుండి విద్యార్థులని బైటికి తెచ్చేందుకు ది దిహిస్టరీ ప్రాజెక్ట్‌ని రూపుదిద్దారు క్వాసిమ్, అయాజ్.
పాకిస్థాన్‌కి చెందిన అయాజ్, క్వాసిమ్ 2001లో 'సీడ్ ఆఫ్ పీస్' సిబిరంలో జరిగిన ఒక డైలాగ్ సెషన్‌కి హాజరయ్యారు. అక్కడ భారత్-పాక్ పూర్వ చరిత్రకు సంబంధించిన కొన్ని విషాయాలని భారతీయ సమకాలికుల మధ్య ప్రస్థావించారిద్దరూ. ఇరుదేశాలు కలిసున్నప్పటి చరిత్రపై ఇరు దేశస్తుల సంభాషణలు కొనసాగాయి. అయితే ఆయాజ్, క్వాసిమ్లు ప్రస్తావించిన చరిత్ర విషయాలని భారతీయ విద్యార్థులు పూర్తి భిన్న కథనంతో చెప్పడం వీరిని ఆశ్చర్యపరిచింది. 1947లో జరిగిన ఇండో-పాక్ విభజన ఘట్టాన్ని పాక్ చెరిత్ర పుస్తకాలని పరిశీలిస్తే కాశ్మీర్‌ని పాలిస్తున్న హరిసింగ్ రెండు లక్షల మంది ముస్లిములని రాచరిక రాష్ట్రం నుండి క్రూరంగా తరిమేశాడనే ప్రస్తావన ఉంది. భారత్ చెరిత్ర పుస్తకాల్ని తిరగేస్తే కాశ్మీర్‌పై పాకిస్తాన్ సాయుధ చొరబాటు చేసినపుడు హరిసింగ్ భారత్‌కి మద్దతుగా నిలిచేందుకు ఒప్పుకోవడంతో భారత సైన్యం కాశ్మీర్‌ను కాపాడేందుకు ముందుకొచ్చిందనే భిన్నమైన కధనాలుంటాయి. పాఠ్యపుస్తకాల్లో చరిత్రకి సంబంధించి ఏకపక్షంగా సాగిన వర్ణనలే ఇతరులపై దురభిప్రాయ భావనకి, భిన్నాభిప్రాయాలకి ప్రధాన కారణమనిపించింది వారికి.
ఒక సంఘటన గురించి విద్యార్థులు వేరొకరి రచనల ద్వారా కాకుండా సొంత అవగాహనతో ఆలోజింపచేసేందుకు ఫస్ట్ హిస్టరీ టెక్స్ బుక్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించి భారత్-పాక్‌కి సంబంధించిన చరిత్ర సంఘటలన్నిటినీ పొందుపరుస్తున్నారు. పరిశీలనాత్మక ధోరణిని పెంచేందుకు ఇరు దేశాల్లో నిర్వహించే సదస్సుల్లో ఇరుదేశాలకి చెందిన విద్యార్థులు తమ వాదనలని వినిపిస్తారు. 12-14 ఏళ్ల చిన్నారులు తెలిపే ప్రతి విషయాన్నీ ది ఫస్ట్ హిస్టరీ టెక్ట్స్బుక్లో పక్కపక్క పేజీల్లో పొందుపరుస్తారు. భిన్నాభిప్రాయాలున్న విషాయాలపై తుది తీర్పు, అభిప్రాయాలు అన్నీ విధ్యార్థుల పరిశీలకే పరిమితమవుతాయి. తొలిసారి భారత్‌లోని ముంబరు నగరంలోని నాలుగు పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని వుడుదల చేసినప్పుడు ఇండియా-పాక్ చరిత్రని చదవని కొందరు విద్యార్ధులకి చెరిత్ర భిన్నాభిప్రాయలని అర్థంచేసుకోవడం తద్వారా ఇరుదేశాలపై బేధాభిప్రాలని దూరంచేయడం తేలికైంది. ఇదే పుస్తకాన్ని పాకిస్తాన్‌లోని లాహోర్ ప్రాంతీయ పాఠశాల విద్యార్థులకు అందించినపుడు ఇదే తరహా స్పందన లభించడాన్ని ది హిస్టరీ ప్రాజెక్ట్ బృదం మంచి పరిణామంగా భావిస్తోంది.
దేశంలో జరిగే నిత్య సంఘర్షణని ప్రతిబింబించే కార్యాచరణతో పాటు వివరణాత్మక అధ్యయనం ఎంతో మంది విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చింది. ఒక విషయాం సరైనదాకాదా అనినిర్ణయించేది పరిశీలన మాత్రమే. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ప్రతి అంశాన్నీ పరిశోధనాత్మకతతో తెలుసుకోవడంతోపాటు వారిలో ప్రశ్నించే విధానాన్ని పెంపొందించేందుకు కృషిచేస్తోంది ది హిస్టరా ప్రాజెక్ట్.
- శర్వాణి

.jpg)


