గ్రంథాలయాలు విజ్ఞాన సోపానాలని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి మండలంలోని తొండవాడ, డోర్నకంబాల, గంగుడుపల్లె, అగరాల, ఐతేపల్లి, మామండూరు, నడింపల్లి, ముంగిలిపట్టు, చంద్రగిరి, రెడ్డివారిపల్లె, నరసింగాపురం, బుచ్చినాయుడి కండ్రిగ గ్రామాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం గ్రంథాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నెట్ విని యోగం ఎంతగా పెరుగుతున్నా, పేదవర్గాలు, విద్యార్థులు, వద్ధులు విలువైన సమాచారాన్ని పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞాన, వినోదాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల ద్వారా విస్తతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంక ల్పించామని వివరించారు. తుడా పరిధిలోని 9 మండలాల్లో గ్రాంథాలయాల నిర్మాణాలకు సుమారు 30కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ముంగిలిపట్టులో సిఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను భాదితులకు అందజేశారు. వైసిపి నాయకులు హేమేంద్ర కుమార్ రెడ్డి, కొటాల చంద్రశేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, అగరాల దేవారెడ్డి, యుగందర్ రెడ్డి, యారాశి చంద్రశేఖర్ రెడ్డి, ఔరంగజేబు, రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, అగరాల భాస్కర్ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన సోపానాలు
