ప్రజాశక్తి- లావేరు
మండలంలోని తాళ్లవలస గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై మద్దిలపాలెం డిపోకు చెందిన ఆర్టిసి నాన్‌స్టాప్ బస్సు మొరాయించింది. శ్రీకాకుళం నుంచి 45 మంది ప్రయాణికులతో విశాఖపట్నానికి మంగళవారం వెళ్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బస్సు మరమ్మతులకు గురై నిలిచిపోయింది. దాదాపుగా మూడు గంటలకు పైగా బస్సు నిలిచిపోయింది. అయితే కొంత మంది ప్రయాణికులు ఇతర బస్సులు, వాహనాల ద్వారా విశాఖపట్నానికి బయల్దేరారు. అయితే మధ్యహ్నం సమయం ఎండ కావడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. మరమ్మతుల అనంతరం బస్సు విశాఖపట్నానికి బయల్దేరింది.
నిలిచిన ఆర్టిసి బస్సు
